
టెండర్ షెడ్యూల్లో మార్పులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో పౌరసరఫరాల సంస్థకు చెందిన 14 మండల స్థాయి. గోదాములలో పి.డి.ఎస్.బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను రెండో దశ రవాణాకు వేసిన టెండరు షెడ్యూల్లో మార్పులు చేస్తున్నట్టు జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ ఒక ప్రకటనలో తెలపారు. వివరాలకు సహాయ మేనేజరు 7732098637 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
రిటైర్డ్ పోలీసులకు సత్కారం
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వర్తించి బుధవారం ఉద్యోగ విరమణ పొందినవారిని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. సన్మాన గ్రహీతలైన ట్రాిఫిక్ ఎస్‌ఐ వి.దేవదానం, ఆఫీస్ సూపరింటెండెంట్ పి.కోటేశ్వరరావు, వజ్రపుకొత్తూరు ఏఎస్‌ఐ ఎన్.అప్పలనాయుడు, ఏఆర్ హెచ్‌సీ ఎన్.చిన్నబాబులకు ఎస్పీ దుశ్శాలువ, పూలమాలలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఏవో సీహెచ్ గోపినాథ్, ఏఆర్ ఆర్‌ఐ నర్సింగరావు, కార్యాలయ సూపరింటెండెంట్లు బాలరాజు, లిల్లీభాయ్ తదితరులు పాల్గొన్నారు.