
‘ప్రజల భద్రత గాలికి’
నరసన్నపేట: కూటమి ప్రభుత్వం ప్రజల భద్రతను గాలికి వదిలేసిందని, ఇటీవలే తిరుపతి తొక్కిసలాటలో కొందరు చనిపోయారని, ఇప్పుడు సింహాచలంలోనూ భక్తులు ప్రాణాలు కోల్పోయారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాల్లో ఉత్సవాలు జరిగేటప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం విచారకరమన్నా రు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. గాయపడిన వారికి మంచి వైద్యం అందించాలని, వాళ్లు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
సింహాచలం ఘటన బాధాకరం
ఇచ్ఛాపురం రూరల్: సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవానికి వచ్చిన భక్తులపై గోడ కూలి కొందరు భక్తులు చనిపోవడంపై ఎమ్మెల్సీ నర్తు రామారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశా రు. గోదావరి పుష్కరాలు, తిరుపతిలో తొక్కిసలాట, వందల సంఖ్యలో గోవుల మృతి, శ్రీకూర్మంలో తాబేళ్ల మృతి, ఇప్పుడు సింహాచలంలో దుర్ఘటన అన్నీ టీడీపీ హయాంలోనే జరుగుతున్నాయని గుర్తు చేశారు. భక్తులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి, క్షతగాత్రులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు.
ప్రశాంతంగా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష
ఎచ్చెర్ల క్యాంపస్: ఏపీ పాలిసెట్–2025 జిల్లాలో బుధవారం సజావుగా జరిగింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించారు. టెక్కలి, శ్రీకాకుళం డివిజన్ల పరిధిలో 39 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. జిల్లా నుంచి 11373 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 10217 మంది హాజరయ్యారు. శ్రీకాకుళం డివిజన్‌లో 6973 మందికి 6183 మంది, టెక్కలి డివిజన్‌లో 4400 మందికి 4034 మంది హాజరయ్యారు. పరీక్ష నిర్వహణను ప్రవేశాల జిల్లా ఇన్‌చార్జి బి.జానకి రామయ్య, జిల్లా అబ్జర్వర్ కె.విజయలక్ష్మి, టెక్కలి అబ్జర్వర్ గోవిందరావు, శ్రీకాకుళం అబ్జర్వర్ కె.రత్న కుమార్ పరీక్షలు పర్యవేక్షించారు.
పి–4 సర్వే ద్వారా 75,566 కుటుంబాల గుర్తింపు
శ్రీకాకుళం పాతబస్టాండ్: పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి–4 విధానాన్ని జిల్లాలో ప్రభావవంతంగా అమలు చేస్తున్నట్టు కలెక్టర్ స్వప్నిల్ దింకర్ పుండ్కర్ తెలిపారు. సమాజంలో ఆర్థికంగా అట్టడుగున ఉన్న 20 శాతం వెనుకబడిన కుటుంబాలను ‘బంగారు కుటుంబాలు’గా గుర్తించామని, జిల్లాలో మొత్తం 75,566 కుటుంబాలు ఈ దిశగా ఎంపికయ్యాయని వెల్లడించారు. వీరిని సమాజంలో ఉన్నత స్థితికి చేర్చేందుకు 10 శాతం మంది ‘మార్గదర్శులు’గా ముందుకు వచ్చి, ఒక్కో బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకుని వారికి విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, ఇతర అవసరాల కోసం తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. దీని ద్వారా ప్రభుత్వ–ప్రైవేట్–ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సర్వేలో గుర్తించిన బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలనుకునే వారు zeropovertyp4. ap.gov.in వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో మాత్రమే కాకుండా రాష్ట్రం, దేశం నలుమూలలలో ఉన్న శ్రీకాకుళం వాసులు ముందుకు రావాలని ఆయన కోరారు.
ఎచ్చెర్లలో పరీక్ష కేంద్రం వద్ద
అధికారులు