ఆర్టీసీలో హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Apr 8 2025 7:43 AM | Updated on Apr 8 2025 7:43 AM

ఆర్టీసీలో హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ శిక్షణకు దరఖాస్తుల ఆ

ఆర్టీసీలో హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ శిక్షణకు దరఖాస్తుల ఆ

శ్రీకాకుళం అర్బన్‌: ఏపీఎస్‌ ఆర్టీసీ శ్రీకాకుళంలో హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌లో ఇస్తున్న శిక్షణను అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల డీఎంలు హనుమంతు అమరసింహుడు, కేఆర్‌ఎస్‌ శర్మ కోరారు. శ్రీకాకుళం ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ శిక్షణకు సంబంధించిన 20వ బ్యాచ్‌ను కాంప్లెక్స్‌ కార్యాలయ ఆవరణలో శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల డీఎంలు హనుమంతు అమరసింహుడు, కేఆర్‌ఎస్‌ శర్మలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమశిక్షణ, అంకిత భావంతో అభ్యర్థులు శిక్షణను నేర్చుకోవాలన్నారు. 21వ బ్యాచ్‌లో చేరుటకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుచున్నామని తెలిపారు. లైట్‌ వెహికల్‌ లైసెన్స్‌, ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలని, 21 ఏళ్లు నిండిన వారు ఈ హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ ట్రైనింగ్‌కు అర్హులని పేర్కొన్నారు. మొత్తము శిక్షణ 40 రోజులు ఉంటుందని తెలిపారు. ఫీజు, ఇతర వివరాల కోసం 7382923293, 7095040608 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ పర్సనల్‌ ఆఫీసర్‌ కృష్ణవేణి, శ్రీకాకుళం 1, 2 డిపోల అసిస్టెంట్‌ మేనేజర్‌లు వి.రమేష్‌, ఎ.గంగరాజు, శిక్షకుడు జీఎన్‌ రావు, సుమన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement