ఇదే పెద్ద పండగ.. | - | Sakshi
Sakshi News home page

ఇదే పెద్ద పండగ..

Apr 4 2025 12:35 AM | Updated on Apr 4 2025 12:35 AM

ఇదే ప

ఇదే పెద్ద పండగ..

ఊరంతా పందిరి వేయాలి.. ఇంటింటా పచ్చ తోరణాలు కట్టాలి.. మంగళ వాద్యాలు ప్రతి వీధిలోనూ వినిపించాలి.. సాగర ఘోషతో సమానంగా వేదమంత్రాలు ప్రతిధ్వనించాలి.. ఆ సందడి మధ్య రామచంద్రుడి పెళ్లి జానకమ్మతో జరగాలి.. ఇది నువ్వలరేవు కట్టుబాటు. అనాదిగా పాటిస్తున్న ఆచారం. రాముడి పెళ్లికి ఆ ఊరివారంతా పెళ్లి పెద్దలుగా మారిపోతారు. ఇంటి ఆడపడుచుకు కన్యాదానం చేసినంత సంబరంగా సీతమ్మను రామ చంద్రుడి చేతిలో పెడతారు. పెళ్లి చేయగానే పండగ కాదు.. కదా మరో ఆరు రోజులాగి రావణ సంహారాన్ని కూడా కానిచ్చి నవమి వేడుకలు పూర్తి చేస్తారు.

● సాగర తీరంలో సీతారాముల పరిణయం

● నువ్వలరేవులో ఆధ్యాత్మిక శోభ

● 12వ తేదీ వరకు అట్టహాసంగా శ్రీరామనవమి ఉత్సవాలు

వజ్రపుకొత్తూరు రూరల్‌:

లస పక్షులు వచ్చి వాలిపోయాయి. చలువ పందిళ్లు కొలువు దీరాయి. శుభరాట కూడా ఠీవిగా నిలబడింది. మొత్తానికి నువ్వలరేవు మినీ అయోధ్యలా మారిపోయింది. జిల్లాలోనే అతి పెద్ద మత్స్యకార గ్రామమైన నువ్వలరేవు రామనవమికి సిద్ధమైంది. పెద్దలు పెట్టిన కట్టుబాట్లను తూచా తప్పకుండా పాటించే ఈ గ్రామంలో సీతారాముల కల్యా ణం చేయడం తమ బాధ్యతగా భావిస్తారు.

ఈ మత్స్యకార గ్రామంలో సుమారు 3,300 ఇళ్లు ఉండగా దాదాపుగా 12 వేల మంది జనాభా ఉన్నారు. కేవలం బెహరా, మువ్వల, బైనపల్లి ఇంటి పేర్లతో ఉండే ఈ గ్రామంలో ‘బెహరా’లను గ్రా మ పెద్దగా నిర్ణయిస్తారు. పెద బెహరా, చిన బెహరాలు చెప్పే మాటలకు కట్టుబడి కార్యక్రమాలు చేపడతారు. గ్రామంలో జరిగే అన్ని ఉత్సవాల కంటే సీతారాముల కల్యాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఏటా వైభవంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా మార్చి 30 (ఆదివారం) నుంచి ఏప్రిల్‌ 12వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిపేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేపట్టారు.

కార్యక్రమాలు ఇవే

రామ నవమి వేడుకల కోసం గ్రామంలో పెద్దలంతా సమావేశం ఏర్పాటు చేసి కార్యక్రమాలను రూపొందించారు. గత నెల 30న సాయంత్రం దాసుడు ఇంటి నుంచి దేవరతో బయలుదేరి ఠక్కురాణి అమ్మవారికి పూజలు చేసి జెండా ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలు వచ్చే నెల 12న జరిగే రావణ సంహారంతో ముగియనున్నాయి. ఉత్సవాల్లో ప్రధా న ఘట్టం శ్రీరామనవమి. ఆ రోజున ముందుగా గ్రామ దేవత బృందావతి అమ్మవారి ఆలయం వద్ద జెండాను ఆవిష్కరించి ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే రామాలయం వద్ద మరో జెండాను ఆవిష్కరించి హోమం, యజ్ఞాలతో పండితులు వేదమంత్రోచ్ఛరణల మధ్య సీతారాములు కల్యాణం కనుల పండువగా జరుపుతారు. తర్వాత రోజు నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతాయి. ఇందులో భాగంగా యువకులు డ్యాన్స్‌లు, పగటి వేషాలతో అలరిస్తారు. కర్రసాము, పాండురంగ నాటకం, రామ నాటకం, రామయ్య పట్టాభిషేకం, మం

తాము ఎక్కడ ఉన్నా గ్రామ దేవత బృందావతి అమ్మవారి చల్లన దీవెనలు, సీతారాముల కరుణా కటాక్షాలు తమపై ఎల్లప్పుడూ ఉంటాయని గ్రామస్తుల విశ్వాసం. అందుకే సుమారు రూ.50 లక్షల వరకు వెచ్చించి అత్యంత వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని పెద్ద పండగగా ఏటా జరుపుకుంటారు. శ్రీరామ నవమి ఉత్సవాలకు ఏర్పాటు చేసిన విద్యుత్‌ దీపాలతో ఊరంతా మెరిసిపోతోంది. ఉత్సవాలు చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు వేలాదిగా వస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల చొరవతో గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉత్సవాలకు ముస్తాబైన నువ్వలరేవు గ్రామం

ఆచారాలకు పెద్ద పీట

తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలకు పెద్ద పీట వేస్తాం. వలస కూలీలు ఎక్కడ ఉన్నా స్వగ్రామానికి చేరుకుని ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ పెద్దలు, పూజారులు, యువకులు సహకారంతో ఉత్సవాలు జరుపుకుంటాం. – బైనపల్లి నవీన్‌,

సొసైటీ అధ్యక్షుడు, నువ్వలరేవు

వేడుకలకు సిద్ధ్దమైన రామాలయం

డపారాధన, కోయి డ్యాన్స్‌, రావణ దహనం తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ముగిస్తారు.

ఐకమత్యంతో నవమి ఉత్సవాలు

తరతరాలుగా వస్తున్న శ్రీరామ నవమి ఉత్సవాలు ఐకమత్యంతో జరుపుకుంటున్నాం. మా ఇంటి ఇలవేల్పుగా బృందావతి అమ్మవారిని కొలుచుకుంటూ మాకు అదర్శ దైవంగా నిలిచిన శ్రీరాముడు, సీతమ్మలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఏటా వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. – మువ్వల పూర్ణచంద్రరావు, సర్పంచ్‌, నువ్వలరేవు

ఇదే పెద్ద  పండగ.. 1
1/3

ఇదే పెద్ద పండగ..

ఇదే పెద్ద  పండగ.. 2
2/3

ఇదే పెద్ద పండగ..

ఇదే పెద్ద  పండగ.. 3
3/3

ఇదే పెద్ద పండగ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement