శ్రీకాకుళం పాతబస్టాండ్: చిన్నారులను లైంగిక వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం ఒకటో అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి పి.భాస్కరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీ 4వ లైన్‌లో ట్రైబల్ హాస్టల్‌ల్లో పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం–పోక్సోపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల పట్ల అనేక నేరాలు జరుగుతున్నాయని చెప్పారు. అశ్లీల చిత్రాలు చూపించడం నేరమని తెలిపారు. కార్యక్రమంలో అడ్వకేట్ జి.ఇందిరాప్రసాద్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఏ.రాజారావు, ఆర్.అప్పలస్వామి, జి.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.