పల్లె గూటికి పండగొచ్చింది | - | Sakshi
Sakshi News home page

పల్లె గూటికి పండగొచ్చింది

Mar 21 2025 12:51 AM | Updated on Mar 21 2025 12:50 AM

● నేటి నుంచి పోలవరంలో పాశిపోలమ్మ సిరిమానోత్సవాలు ● తొమ్మిదేళ్ల తర్వాత ఉత్సవాల నిర్వహణ ● ఏర్పాట్లు పూర్తి చేసిన కమిటీ సభ్యులు

టెక్కలి:

పల్లెకు నవ వసంతం వచ్చింది. తొమ్మిదేళ్ల తర్వాత పండగొచ్చింది. టెక్కలి మండలం పోలవరంలో తొమ్మిదేళ్ల అనంతరం పాశిపోలమ్మ సిరిమానోత్సవాలు జరగనున్నాయి. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు ఈ నెల 25 వర కు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. 2016లో జరిగే ఈ వేడుకలకు ఉత్సవ కమిటీ సభ్యు లు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సుదూర ప్రాంతాల నుంచి బంధువులు పోలవరం చేరుకోవడంతో గ్రామం కళకళలాడుతోంది. ఉత్సవాల్లో భాగంగా గ్రామ దేవతకు ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

సిరిమానోత్సవం ఇలా..

గ్రామానికి ఆనుకుని వంశధార ప్రధాన కాలువ గట్టుపై గల రావిచెట్టు వద్ద వెలసిన పాశిపోలమ్మ గ్రామదేవతకు సిరిమానోత్సవాలను తొమ్మిదేళ్లకో సారి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామంలో నాయుడుగా పిలవబడే బగాది గంగాధ ర చౌదరి సిరిమానుపై ఆశీనులై అమ్మవారికి పూజ లు చేస్తారు. ప్రతీ ఇంటి నుంచి కొత్త చీరను సిరిమానుకు (చింత కర్రకు) కడతారు. ఆ మానుపై గంగాధర చౌదరి ఆశీనులయ్యాక ఊరేగింపు నిర్వహిస్తా రు. రావిచెట్టు వద్ద పూజలు చేసి ఉత్సవాలను ముగిస్తారు.

ఉత్సవ కార్యక్రమాలివే..

●శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అమ్మవారి గుడి నుంచి మేళ తాళాలతో దేవర తీసుకురావడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

●22న ఉదయం 8 నుంచి పగటి వేషాలతో అమ్మ వారి ఊరేగింపు ఉంటుంది. రణస్థలం, తాడేపల్లిగూడేం కళాకారులతో కోలాటం, తలకాయ డ్యాన్స్‌, చిన్నారులతో కోలాట ప్రదర్శనలు నిర్వహిస్తారు.

●23న అమ్మవారి ఊరేగింపు, తాడేపల్లిగూడేం కళాకారులతో కాంతార, లేడీస్‌ స్పెషల్‌ గ్రూప్‌ డ్యాన్స్‌ లు, మెగా ఈవెంట్స్‌ జరుగుతాయి.

●24న ఉదయం అమ్మవారి ఊరేగింపు, బాడసూర న్న బృందం జాలారి నాటకం, మధ్యాహ్నం విశాఖ పట్నం కళాకారులతో దాండియా నృత్యాలు, ఇచ్ఛాపురం కళాకారులతో కోయి డ్యాన్స్‌లు, రాత్రి 7 గంటలకు గుంటూరు, రాజమండ్రి కళాకారులతో సినీ సూపర్‌ డూప్స్‌ కార్యక్రమాలు, రాత్రి 10 గంటలకు రామాంజనేయ యుద్ధం, సత్యహరిశ్చంద్ర నాటకాలు నిర్వహించనున్నారు.

●25న ఉదయం ఒడిశా కళాకారులతో ధూమ్‌ ధడాకా, సాయంత్రం బిందెల డ్యాన్స్‌లు, తీన్‌మార్‌, అమ్మవారి వేషాలు, సాయంత్రం మేళ తాళాలతో సిరిమానోత్సవం (అంజలి రథోత్సవం అనుపు పండగ) నిర్వహించనున్నారు.

అందరి సహకారంతో...

గ్రామస్తుల సహకారంతో పాశిపోలమ్మ సిరిమానోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. తొమ్మిదేళ్ల తర్వాత జరిగే ఈ వేడులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరి సహకారంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం.

– గురుబెల్లి చిన్నంనాయుడు(బాలకృష్ణ), సర్పంచ్‌, పోలవరం, టెక్కలి మండలం

పల్లె గూటికి పండగొచ్చింది 1
1/2

పల్లె గూటికి పండగొచ్చింది

పల్లె గూటికి పండగొచ్చింది 2
2/2

పల్లె గూటికి పండగొచ్చింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement