శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మరింతగా పోరాడాలని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ముఖ్యనేతలకు ఆదేశించారు. ఇటీవల యువత పోరు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి, డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు, ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి గొర్లె కిరణ్‌కుమార్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, కళింగ వైశ్య కుల రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబులను అభినందించారు. కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పార్టీ నేతలు స్పందిస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి నియోజకరవర్గంలోనూ నాయకులంతా కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు అండగా ఉండాలని సూచించారు. కార్యకర్తలకు ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా వెన్నుదన్నుగా నిలబడాలన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా ముఖ్య నేతలతో వైఎస్ జగన్