Traffic Jam
పద్మవ్యూహంలోకి వెళ్లిన అభిమన్యుడు తిరిగి వస్తాడేమో గానీ.. జిల్లా కేంద్రంలోని డేఅండ్‌నైట్ జంక్షన్‌కు రద్దీ వేళ వెళ్లి తప్పించుకోవడం అంత సులువు కాదు. నిన్న కాక మొన్న ఓ నిండు గర్భిణి ఇదే దారిలో ఆర్తనాదాలు చేస్తూ ప్రాణాలు వదిలేసింది. ట్రాఫిక్ రణగొణ ధ్వనులు అలవాటైపోయిన చెవులు ఆ ఆర్తనాదాలను అప్పుడే మర్చిపోయాయి. ఒక శ్మశానం, పక్కనే పెద్ద స్కూల్, పదుల సంఖ్యలో ఆస్పత్రులు, ల్యాబ్‌లు, వందల సంఖ్యలో ప్రయాణికులు, ఆపై ఆటోస్టాండ్.. అన్నీ ఇక్కడే ఉండడంతో ట్రాఫిక్‌కు నిరంతరం ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. అవే కొందరికి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. మనసు పెడితే దీనికీ పరిష్కార మార్గాలున్నాయి. – శ్రీకాకుళం క్రైమ్
బ్రిడ్జి చివరన కుడివైపు మలుపులో సెయింట్ జోసెఫ్ స్కూల్ వైపు పాఠశాల విద్యార్థులు.. మరో వైపు అత్యవసరం వైద్యం కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారు.. మరో వైపు అంత్యక్రియలకు హాజరయ్యే వారితో పాటు సాధారణ ప్రజానీకం.. చాలా క్లిష్టమైన పరిస్థితే. గంటల కొద్దీ వాహనాలు నిలిచి చికాకుకు కలిగించే పరిస్థితులు రోజుకీ కో కొల్లలు. దీనిపైన ట్రాఫిక్ వ్యవస్థ.. బాగా స్టడీ చేయాలి. పరిమిత వేళల్లోనైనా సరే ఒన్ వే ఏర్పాటు చేయాలి. వెళ్లడం వరకు ఓకే గానీ తిరిగి మాత్రం కేఎల్‌నాయుడు ఆస్పత్రి మీదుగా పాత సీఎంఆర్ వెనుక వైపు నుంచి విజయగణపతి ఆలయం చౌరస్తా నుంచి వాహనాలు వెళ్లే విధంగా చూస్తే కొంత సమస్యకు పరిష్కారం దక్కుతుంది.
బ్రిడ్జి చివరన కుడివైపు మలుపులో సెయింట్ జోసెఫ్ స్కూల్, శ్మశాన వాటిక, కొన్ని ల్యాబ్‌లు, ఆస్పత్రులు ఉండడంతో ఆ మార్గంలో తీవ్రమైన రద్దీ నెలకొంటోంది. కేవలం 10 నుంచి 12 అడుగుల ఇరుకై న దారిలో ఇటు ద్విచక్రవాహనాలు.. ఆటోలు.. కార్లు రాకపోకలు సాగిస్తుండటంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడి.. బ్రిడ్జి నుంచి డే అండ్ నైట్ సిగ్నల్ వరకు వాహనాలు బారులు తీరుతున్నాయి.
7
వెరీ టైట్
వెరీ టైట్