జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ చేయాలి | - | Sakshi
Sakshi News home page

జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ చేయాలి

Mar 20 2025 1:02 AM | Updated on Mar 20 2025 1:01 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని మాల, రెల్లి, వాటి అనుబంధ కులాల నేతలు కోరారు. ఈ మేరకు జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రం యూనిట్‌గా వర్గీకరణ చేస్తే తమకు అన్యాయం జరుగుతుందని వాపోయారు. అందువలన ఆ ఆలోచనను ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. 14 ఏళ్ల క్రితం జనాభా లెక్కలను ఎలా పరిగణలోకి తీసుకుంటారని ప్రశ్నించారు. జేసీని కలిసినవారిలో తైక్వాండో శ్రీను, కంఠ వేణు, అర్జి కోటి, అర్జీ ఈశ్వరరావు, జలగడుగుల గోవిందరావు, జలగడుగుల శ్రీరామ, గొల్లపల్లి మోహన్‌, అర్జి రామ్మోహన్‌రావు, అర్జి చిన్న, కె.కూర్మారావు, కల్యాణి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

అదుపులోకి రాని మంటలు

మందస: మండలంలోని చీపి గ్రామ సమీపంలో ఉన్న రిజర్వ్‌ ఫారెస్ట్‌లో మంగళవారం చెలరేగిన అగ్నికీలలు ఇంకా అదుపులోకి రాలేదు. దీంతో అటవీ ప్రాంతంలోని ఔషధ వనరులు, వన్యప్రాణులు మంటల్లో కాలి బూడిదవుతున్నాయి. బుధవారం నాటికి రుక్కి పర్వత ప్రాంతానికి మంటలు వ్యాపించాయి. అటవీ శాఖ అధికారులు ఈ ప్రమాదంపై స్పందించకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హత్య కేసులో నిందితుడు అరెస్టు

ఎచ్చెర్ల క్యాంపస్‌: ఎచ్చెర్ల మండలంలోని సంతసీతారంపురంలో భార్య గాలి నాగమ్మను అతి కిరాతకంగా హత్యచేసి, ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌లో స్వచ్ఛందంగా లొంగిపోయిన అప్పలరెడ్డిని జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం బుధవారం అరెస్టు చేశారు. శ్రీకాకుళం కోర్టులో నిందితుడిని హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో అతడిని అంపోలు సబ్‌జైల్‌కు తరలించారు. సోమవారం రాత్రి మద్యం మత్తులో అనుమానంతో భార్యను దారుణంగా కత్తితో నరికాడు. హత్యలో ఒకడికి మాత్రమే ప్రమేయం ఉండడం, నిందితుడు లొంగిపోవడంతో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అనంతరం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి అరెస్టుకు ఎస్‌ఐలు వి.సందీప్‌కుమార్‌, నక్క కృష్ణారావు సహకరించారు.

గ్రేట్‌ అనిపించారు..!

కవిటి: దేశంలోని పలు ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన గ్రాడ్యూయే ట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌(గేట్‌)– 2025 ఫలితాల్లో కవిటి మండలం బల్ల ఎర్రగోవిందపుట్టుగకు చెందిన బల్ల తనూజ మెరిసింది. బుధవారం విడుదల చేసిన ఫ లితాల్లో జాతీయ స్థాయిలో 396వ ర్యాంకు కై వసం చేసుకుంది. సాయి తనూజా తండ్రి జానకిరావు సోంపేట మండలంలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు.

సత్తాచాటిన పూజిత

ఎల్‌.ఎన్‌.పేట: మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా పనిచేస్తున్న పైడి శ్రీనివాసరావు కుమార్తె పైడి పూజిత గేట్‌–2025లో సత్తా చాటింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో ఆల్‌ ఇండియా స్థాయిలో 25వ ర్యాంకు సాధించినట్లు ఆయన తెలిపారు. దీంతో ఆమెను పలువురు అభినందించారు.

ఎచ్చెర్ల క్యాంపస్‌: టెక్కలి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్యూటేషన్‌పై అధ్యాపకునిగా పనిచేస్తున్న కొండ వినోద్‌ కుమార్‌కు గేట్‌లో ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో జాతీయ స్థాయిలో 28 ర్యాంకు వచ్చింది. అతను శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో 2012–15 మధ్య పాలిటెక్నిక్‌, అనంతరం టెక్కలి ఐతం ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో బీటెక్‌ పూర్తిచేసి పాలిటెక్నిక్‌ అధ్యాపకుడిగా ఎంపికయ్యాడు. జాతీయ విద్యా సంస్థల్లో ఎంటెక్‌ చేయాలన్న ఆకాంక్షతో గేట్‌ రాయగా మంచి ర్యాంకు సాధించాడు. ప్రతిష్టాత్మక ఐఐటీలో ఎంటెక్‌ పూర్తిచేసి, బోధన రంగంలో అత్యున్నత స్థాయికి చేరడమే తన లక్ష్యమన్నారు.

జిల్లా యూనిట్‌గా  ఎస్సీ వర్గీకరణ చేయాలి 1
1/5

జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ చేయాలి

జిల్లా యూనిట్‌గా  ఎస్సీ వర్గీకరణ చేయాలి 2
2/5

జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ చేయాలి

జిల్లా యూనిట్‌గా  ఎస్సీ వర్గీకరణ చేయాలి 3
3/5

జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ చేయాలి

జిల్లా యూనిట్‌గా  ఎస్సీ వర్గీకరణ చేయాలి 4
4/5

జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ చేయాలి

జిల్లా యూనిట్‌గా  ఎస్సీ వర్గీకరణ చేయాలి 5
5/5

జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement