
ఆప్కాస్‌ను కొనసాగించాలని ధర్నా
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్ రద్దు నిర్ణయం ఉపసంహరించుకోవాలని కాంట్రాక్ట్ – ఔట్‌సోర్సింగ్ ఫెడరేషన్ జిల్లా నాయకులు ఆర్.చిన్నారావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.మురళీ, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆప్కాస్‌ను కొనసాగించాలని, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ – స్థానిక సంస్థలలోని ఔట్‌సోర్సింగ్, యూనివర్సిటీలు, ప్రభుత్వ సొసైటీలు, విద్యుత్, నేషనల్ హెల్త్ మిషన్, సమగ్రశిక్ష తదితర అన్ని ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎంటీఎస్ అమలు చేయాలని, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు ఏపీ కాంట్రాక్ట్ –ఔట్ సోర్సింగ్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేపట్టారు. ముందుగా శ్రీకాకుళం ఆర్ అండ్ బీ బంగ్లా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆప్కాస్‌ను రద్దు చేసి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నియమించాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభు త్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచాలన్నారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆప్కాస్‌లో వివిధ వి భాగాల ప్రతినిధులు నక్క శ్రీనివాసరావు, ధన్వంతరి, ప్రసాద్, గుజ్జల ఆదినారాయణ, రిమ్స్ ఉద్యోగు లు కె.తేజ, టి.కిరణ్, టి.సాయి, జి.ధర్మారావు, జ్యో తికుమారి, మౌనిక, ప్రత్యూష, శిరీష పాల్గొన్నారు.