రాజగోపాలరావు సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

రాజగోపాలరావు సేవలు చిరస్మరణీయం

Mar 13 2025 12:31 AM | Updated on Mar 13 2025 12:30 AM

● వైఎస్సార్‌సీపీ కళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కళింగ జాతి అభివృద్ధికి బొడ్డేపల్లి రాజగోపాలరావు చేసిన సేవలు చిరస్మరణీయమని వైఎస్సార్‌సీపీ కళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు, కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దుంపల లక్ష్మణరావు అన్నారు. బుధవారం బొడ్డేపల్లి రాజగోపాలరావు 102వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలోని సింహద్వారం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి పదవి కావాలా.. ప్రాజెక్టు కావాలా అని అప్పట్లో ఆయనకు ఆఫర్‌ ఇస్తే ప్రాజెక్టు కావాలంటూ జిల్లా అభివృద్ధి కోరుకున్న మహనీయుడని కొనియాడారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ కళింగ జాతికి బీసీ–ఏ రిజర్వేషన్‌ కల్పించేందుకు ఎంతో కృషి చేశారన్నారు. ఆయన కృషి వలన నేడు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నామని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణించినా ప్రతీ ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పొందూరు మండల పార్టీ అధ్యక్షుడు పప్పల రమేష్‌, చింతాడ ప్రసాద్‌, పైడి నాగభూషణ్‌, సీపాన రామారావు, చాపర వెంకటరావు, పైడి శ్రీను, తిర్లంగి లోకనాథం, బొడ్డేపల్లి మోహన్‌, గురుగుబెల్లి శేఖర్‌, పప్పల సూర్యారావు, పొన్నాడ సత్యం, దుంపల గోవిందరావు, సీపాన హేమసుందర్‌, చింతాడ శ్రీను, మెట్ట రామారావు, బుడుమురు మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement