స్వాతీ సోమనాథ్.. ఈ పేరు చెబితే చాలు.. మరీ ఎక్కువ పరిచయం అక్కర్లేదు. దూసి గ్రామంలో మొదలైన ఆమె ప్రస్థానం నేడు ఖండాంతరాలు దాటింది. కూచిపూడి నృత్య కళతో అంచెలంచెలుగా ఎదిగారు. ఆమె 1980లో అరంగ్రేటం చేశారు. దాదాపుగా వెయ్యి సోలో ప్రదర్శనలు ఇచ్చారు. ఎంఏ ఇంగ్లిష్, ఎంఫిల్ పూర్తి చేశారు. సెంట్రల్స్ యూనివర్సిటీలో ఆర్ట్స్‌లో మాస్టర్ పెర్ఫామెన్స్ చేశారు. దాదాపు 40 దేశాలు పర్యటించి ప్రదర్శనలు చేశారు. 13 బ్యాలేలు రూపొందించారు. శ్రీకాకుళంలో కూచిపూడి సంప్రదాయ గురుకులం నిర్వహిస్తూ కళకు కాపలా కాస్తున్నారు. ఇంతవరకు ఎవరూ చేయని కిన్నెరసాని పాటలకు 45 నిమిషాల పాటు బాలేను రూపొందించారు. త్వరలో అమెరికాలో జరిగే తానా సభలలో సంప్రదాయం చిన్నారులచే ప్రదర్శన కోసం కృషి చేస్తున్నారు. – శ్రీకాకుళం కల్చరల్
బతుకు నిత్య నృత్యం..