516 పెన్నులతో అలంకరణ | - | Sakshi
Sakshi News home page

516 పెన్నులతో అలంకరణ

Mar 6 2025 1:28 AM | Updated on Mar 6 2025 1:28 AM

516 ప

516 పెన్నులతో అలంకరణ

నరసన్నపేటలోని వేంకటేశ్వర ఆలయం సమీపంలో ఉన్న లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి బుధవారం 516 పెన్నులతో అర్చన చేశారు. అనంతరం వాటిని తోరణంగా అలంకరించారు. అర్చకులు భాస్కరబట్ల జగదీశ్వర శర్మ పూజా కార్యక్రమం పూర్తయ్యాక పదో తరగతి విద్యార్థులకు ఈ పెన్నులు పంపిణీ చేశారు. – నరసన్నపేట

పీజీ మూడో సెమిస్టర్‌

ఫలితాలు విడుదల

ఎచ్చెర్ల క్యాంపస్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల పోస్టు గ్రాడ్యుయేషన్‌ మూడో సెమిస్టర్‌ ఫలితాలను బుధవారం ఎగ్జామినేషన్స్‌ డీన్‌ ఎస్‌.ఉదయ్‌భాస్కర్‌ విడుదల చేశారు. ఫలితాలను వర్సిటీ వెబ్‌సైట్‌, జ్ఞానభూమి పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. రీవాల్యుయేషన్‌కు 15 రోజుల్లోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎకనామిక్స్‌, ఇంగ్లీష్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌, తెలుగు, ఎంకాం, ఎంబీఏ, ఎంఈడీ, ఎంఎల్‌ఐసీ, జువాలజీ, ఎంజేఎంసీ, మైక్రోబయోలజీ కోర్సుల్లో శతశాతం ఉత్తీర్ణత నమోదైంది. కంప్యూటర్‌ సైన్స్‌లో 22 మందికి 18 మంది, అప్లయిడ్‌ మ్యాథ్స్‌లో 8 మందికి ఏడుగురు, ఎనలిటికల్‌ కెమిస్ట్రీలో 41 మందికి 40 మంది, బయోటెక్నాలజీలో 25 మందికి 24 మంది, ఫిజిక్స్‌లో 12 మందికి 8 మంది, ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో 185 మందికి 118 మంది, గణితంలో 15 మందికి 14 మంది ఉత్తీర్ణత సాధించారు.

నేడు మద్యం షాపుల లాటరీ

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లా లో గీత, సొండి కులా లకు కేటాయించిన 18 మద్యం షాపులకు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ చేతుల మీదుగా గురువారం ఉదయం 10 గంటలకు డ్రా తీయనున్నారు. ఈ మేరకు శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాల సమీపంలోని అంబేడ్కర్‌ ఆడిటోరియానికి ఉదయం ఎనిమిది గంటలకల్లా దరఖాస్తుదారులు హాజరుకావాలని జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి సీహెచ్‌.తిరుపతినాయుడు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన మద్యం పాలసీ (2024–26)లో భాగంగా జిల్లాలో గీత, సొండి కులాల వారికి పదిశాతం మద్యం దుకాణాలు ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. జిల్లాలో 18 షాపులకు 203 దరఖాస్తులు అందాయి. మొదటగా ఫిబ్రవరి 10న డ్రా తీయాలని నిర్ణయించినా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా వాయిదా వేశారు.

పీడీఎస్‌ బియ్యం పట్టివేత

గార : మండల పరిధిలోని అంపోలు జంక్షన్‌ వద్ద విజిలెన్స్‌, ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు సంయుక్తంగా జరిపిన దాడుల్లో 54 బస్తాల పీడీఎస్‌ బియ్యం పట్టుకున్నారు. బుధవారం సాయంత్రం సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా బియ్యం రవాణా చేస్తూ వాహనం పట్టుబడిందని విజిలెన్సు అధికారులు యు.వెంకటేష్‌, ఎస్సై రామారావు తెలిపారు. నడగాం గ్రామానికి చెందిన పొట్నూరు శ్రీరామమూర్తి స్థానికంగా బియ్యం సేకరించి నడగాం పరిసర ప్రాంతాల్లోని కోళ్లఫారాలకు రవాణా చేస్తున్నట్టు గుర్తించామని చెప్పారు. విజిలెన్స్‌ ఎస్పీ బి.ప్రసాదరావు ఆదేశాల మేరకు పీడీఎస్‌ అక్రమ రవాణాదారులపై నిఘా ఉంచామని, పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

307 మంది గైర్హాజరు

శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలు సాఫీగా సాగుతున్నాయి. నాలుగో రోజు బుధవారం జనరల్‌, ఒకేషనల్‌ రెండు విభాగాల్లో కలిపి 18,709 మంది సెకెండియర్‌ విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 18,402 మంది పరీక్ష రాశారు. 307 మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి మాల్‌ ప్రాక్టీసు కేసు లు నమోదుకాలేదని ఆర్‌ఐఓ ప్రగడ దుర్గారా వు, డీవీఈఓ ఎస్‌.తవిటినాయుడు తెలిపారు.

516 పెన్నులతో అలంకరణ 1
1/2

516 పెన్నులతో అలంకరణ

516 పెన్నులతో అలంకరణ 2
2/2

516 పెన్నులతో అలంకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement