మెళియాపుట్టి: మండలంలోని పట్టుపురం గ్రామానికి చెందిన పతివాడ మురళి మంగళవారం జాడుపల్లి గ్రామానికి వ్యక్తిగత పని నిమిత్తం బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా బురద రామచంద్రాపురం వద్ద అదుపు తప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. సిబ్బంది వెంటనే చేరుకుని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లారు.
అంధత్వ నివారణే లక్ష్యం
అరసవల్లి: జిల్లాలో అంధత్వ నివారణ లక్ష్యంగా ప్రతి ఒక్క కంటి వైద్యుడూ పనిచేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ బాలమురళీకృష్ణ సూచించారు. మంగళవారం తన చాంబర్‌లో కంటి వైద్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా నిర్వహిస్తున్న కాటరాక్ట్ శిబిరాలను సందర్శించి బాధితులను గుర్తించి జిల్లా కేంద్రానికి రిఫరల్ చేయాలన్నారు. ప్రతి నెలా అడ్వాన్స్‌డ్ టూర్ ప్రోగాం ప్రకారం ప్రతిరోజూ ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం బడిపిల్లలకు కళ్లద్దాలను సకాలంలో అందజేసినందుకు ఆప్తాలమిక్ అధికారులను అభినందించారు. సమావేశంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం అధికారి డాక్టర్ త్రినాథరావు, డిప్యూటి పారా మెడికల్ అధికారి వాన సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
8న పీఓడబ్ల్యూ సంస్థల
విలీన సభ
పలాస: ఒంగోలులో ఈ నెల 8న జరగనున్న పీఓడబ్ల్యూ(ప్రగతి శీల మహిళా సంఘం) సంస్థల విలీన సభను విజయవంతం చేయాలని సంఘం జిల్లా నాయకులు కోరారు. ఈ మేరకు పలాస మండలం మాకన్నపల్లిలో మంగళవారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థల జిల్లా అధ్యక్షులు ఎస్.కృష్ణవేణి, బి.ఈశ్వరమ్మలు మాట్లాడుతూ భావసారూప్యత కలిగిన అన్ని మహిళా సంఘాలు ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా కార్యదర్శి పోతనపల్లి కుసుమ మాట్లాడుతూ మహిళా హక్కుల సాధనకు సంఘటిత పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘ నాయకులు కుత్తుం హేమక్క, బర్ల జానకి, సైని కళావతి, బత్తిన ఉమ, బత్తిన సాయమ్మ, వెంకటమ్మ, పూర్ణావతి, ధన లక్ష్మి, మోహిని తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల విజేతగా ‘జెస్సీ’
పలాస: మండలంలోని బొడ్డపాడు యువజన సంఘం 71వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జెస్సీ(బొడ్డపాడు) జట్టు విజేతగా నిలిచింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 30 జట్లు పాల్గొన్న ఈ టోర్నీ మూడ రోజులుగా ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోటీల్లో బాహడపల్లి జట్టుపై జెస్సీ జట్టు విజయం సాధించింది. విజేత జట్టుకు రూ.40వేలు నగదు, షీల్డ్‌ను బొడ్డపాడు యువజన సంఘం అధ్యక్షుడు తామాడ క్రాంతి చేతుల మీదుగా అందజేశారు. రన్నరప్‌కు రూ.30వేలు, షీల్డు, తృతీయ స్థానంలో నిలిచిన వైజాగ్ వారియర్స్‌కు రూ.20వేలు నగదు, నాలుగో స్థానంలో నిలిచిన విజయనగరం జట్టుకు రూ.10వేలు చొప్పున నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జైభీమ్ యువజన సంఘం అధ్యక్షుడు కిక్కర ఢిల్లీరావు, కరగాన సుధా, కరగాన కుమార్, బొడ్డు జగన్, రెయ్యి మోహనరావు, బొడ్డు శ్రీనివాస్, రాజాం శ్రీనివాస్, గర్తం తులసీరావు, పోతనపల్లి గణపతి, బుడత బాలరాజు, కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాపాక అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు