వంశధారలో వినాశన కాండ | - | Sakshi
Sakshi News home page

వంశధారలో వినాశన కాండ

Mar 4 2025 1:44 AM | Updated on Mar 4 2025 1:41 AM

బోర్లు మొరాయిస్తున్నాయి..

వంశధారి నదిలో ఇసుక అక్రమార్కుల బరితెగింపు

పెద్ద పెద్ద గొట్టాల ద్వారా నీరు మళ్లింపు

మారిపోతున్న నదీ గమనం

పరిమితికి మించి తవ్వకాలు జరపడంతో అడుగంటిపోతున్న భూగర్భ జలాలు

బైరి పరిసర ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేయడంతో చాలా చోట్ల బోర్లు మొరాయిస్తున్నాయి. గ్రామంలోని వ్యవసాయ బోర్లు 70వరకు ఉన్నాయి. ఇటీవల మైనింగ్‌, రెవెన్యూ అధికారులు వచ్చి నదీ పరివాహక ప్రాంతాన్ని సందర్శించినప్పుడు గ్రామస్తులకు ఎలాంటి నష్టం లేకుండా చూస్తామన్నారు. కానీ ప్రస్తుతం అనుమతులకు మించి తవ్వకాలు చేయడంతో తాగునీటిని అందించే బోర్లు సైతం పనికి రాకుండా పోతున్నాయి. – మూల కృష్ణవేణి, బైరి

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇసుక అక్రమార్కులు ఏకంగా వంశధార నదికి తీరని అన్యాయం చేస్తున్నా రు. అధికారం చేతిలో ఉండడంతో అడ్డూఅదుపు లేకుండా రెచ్చిపోతున్నారు. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించి, ప్రకృతి వనరులను దోచుకుంటున్నారు. ఇష్టారీతిన నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపుల్లో రూ.కోట్లు సంపాదిస్తున్నారు. వంశధార నదీ తీరంలో ఏర్పాటు చేసిన ఇసుక ర్యాంపుల్లో గుట్టల కొద్దీ ఇసుక తరలిపోతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు.

బైరిలో విధ్వంసం..

శ్రీకాకుళం రూరల్‌ పరిధిలోని బైరి గ్రామంలో నడుస్తున్న ఇసుక ర్యాంపుల నుంచి నిత్యం రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక లారీల్లో తోడేస్తూ తరలిస్తు న్నారు. నదీగర్భంలోకి ఏకంగా అనధికారికంగా రహదారి వేసేశారు. నదిలో ఉన్న నీటిని పెద్ద పెద్ద గొట్టాల ద్వారా బయటకు మళ్లిస్తున్నారు. ఇసుక తవ్వకాలు జరిపే సమయంలో పాటించాల్సిన నిబంధనలు తుంగలో తొక్కేస్తున్నారు. ప్రభుత్వ అనుమతి ఉన్న ఇసుక ర్యాంపుల్లో మీటర్‌ లోతులో కేవలం మనుషులతోనే తవ్వకాలు చేపట్టాలి. కానీ ఇక్కడ యంత్రాలతో తోడేస్తున్నారు. ఐదు నుంచి 10 మీటర్ల లోతు వరకు తవ్వకాలు చేపడుతున్నారు. ఇసుక మేటలతో పాటు నదీ గర్భాన్ని తవ్వేసి, టన్నుల కొద్దీ ఇసుకను నదిలోనే పోగేసి ఉంచుతున్నారు. పెద్ద పెద్ద దిబ్బలుగా వేసి, అక్కడికే ఏకంగా లారీలను రప్పించి లోడింగ్‌ చేస్తున్నారు.

నదీ గమనానికి, బోర్లకు ముప్పు

నిబంధనలు అతిక్రమించి మీటర్‌ దాటి తవ్వితే నది సమతుల్యత దెబ్బతిని, ప్రవాహంలో మార్పు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే గ్రామానికి సమీపంలో ఉండే నీరు కిలోమీటర్ల దూరం వెళ్లిపోయింది. గ్రామంలో గల తాగునీరు, సాగునీటి బోర్లు 40 వరకు మూలకు చేరిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో బోర్లకు నీరు అందుతూ మధ్యలోనే ఆగిపోవడంతో మోటర్లు సైతం పాడవుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. నదిలో లోతుగా తవ్వకాలు జరపడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి ఆ బోర్లన్నీ పనికి రాకుండా పోతున్నాయి.

వంశధారలో వినాశన కాండ1
1/4

వంశధారలో వినాశన కాండ

వంశధారలో వినాశన కాండ2
2/4

వంశధారలో వినాశన కాండ

వంశధారలో వినాశన కాండ3
3/4

వంశధారలో వినాశన కాండ

వంశధారలో వినాశన కాండ4
4/4

వంశధారలో వినాశన కాండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement