
పాత్రునివలసలో మంచినీటి పనులను పరిశీలిస్తున్న టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్
అరసవల్లి: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 8న చైర్‌పర్సన్ పిరియా విజయ అధ్యక్షతన జరగనుందని సీఈవో ఆర్.వెంకట్‌రామన్ ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీటీసీలు, మండల పరిషత్ అధ్యక్షులు, ముఖ్య ప్రజాప్రతినిధులు హాజరుకావాలని కోరారు. సమగ్ర సమాచారంతో ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులే స్వయంగా పాల్గొనాలని సూచించారు.
మూడో వారంలో
టిడ్కో ఇళ్లు అందజేత
శ్రీకాకుళం రూరల్: ఈ నెల మూడో వారంలో టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఏపీ టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ తెలిపారు. శనివారం పాత్రునివలసలోని టిడ్కో ఇళ్లను పరిశీలించా రు. ఇంజినీరింగ్ సిబ్బంది, కాంట్రాక్టర్లతో కలి సి పనులపై సమీక్షించారు. నాగావళి నది నుంచి మంచినీటి సరఫరా, ఎస్‌టీపీ ట్రయల్ రన్ పనులపై ఆరా తీశారు. 1280 టిడ్కో ఇళ్లను నిర్ణీత కాలంలో పూర్తి చేసి లబ్ధిదారులకు అంద జేస్తామని చెప్పారు. ఈయనతో పాటు మున్సి పల్ కార్పొరేషన్ కమిషనర్ సీహెచ్ ఓబులేశు, మెప్మా డైరెక్టర్ కిరణ్‌కుమార్, టిడ్కో సూపరింటెండెంట్ ఇంజినీర్ నరసింహమూర్తి తదితరులు ఉన్నారు.
కుక్కల దాడిలో జింక మృతి
ఎచ్చెర్ల క్యాంపస్: కుక్కల దాడిలో జింక మృతి చెందింది. శనివారం ఎస్‌ఎంపురం కొండ నుంచి చెరువులో నీరు తాగేందుకు ఎచ్చెర్ల మండల కాంప్లెక్స్ సమీపంలోకి వచ్చిన జింకను కుక్కల గుంపు వెంబడించింది. సాంకేతిక శిక్షణ కేంద్రం సిబ్బంది జింకను రక్షించే ప్రయత్నం చేసి నా ఫలితం లేకపోయింది. అటవీ శాఖ అధికారులు వచ్చేలోపే జింక మృతి చెందింది. అనంతరం జింకకు అంత్యక్రియలు నిర్వహించారు.
పాడేరుకు ఏరువాక కేంద్రం తరలింపు
ఆమదాలవలస: ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసా య విశ్వవిద్యాలయం ఆదేశాల మేరకు శ్రీకాకు ళం జిల్లా(ఆమదాలవలస)లోని ఏరువాక కేంద్రాన్ని పాడేరు తరలించినట్లు సమన్వయకర్త డాక్టర్ జె.జగన్నాథం శనివారం తెలిపారు. ఇకపై శాస్త్రవేత్తలు, సిబ్బంది పాడేరులోని సీడ్‌ఫాం గోదాము వద్ద ప్రారంభించిన వ్యవసాయ పరిశోధన కేంద్రంలో విధులు నిర్వహి స్తారని పేర్కొన్నారు.

మృతి చెందిన జింక

ఆమదాలవలసలోని వ్యవసాయ పరిశోధన కేంద్రం