
గార: ఆసరా సంబరాల్లో మాట్లాడుతున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైఎస్సార్ ఆసరా సంబరాలు జనజాతరను తలపిస్తున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్వహిస్తున్న సభలకు మహిళలు పోటెత్తుతున్నారు. సీఎం చిత్రపటాలు, కటౌట్‌లకు పాలాభిషేకాలతో అభిమానం చాటుకుంటున్నారు. టీడీపీ హయాంలో రుణమాఫీ పేరిట మోసగించారని, సీఎం జగన్ మాత్రం ఎన్నికల హామీ నిలబెట్టుకుంటూ మహిళల ఆర్థిక స్వావలంబనకు అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. శనివారం నిర్వహించిన సంబరాల్లో పాల్గొనేందుకు మహిళలు వర్షాన్ని సైతం లెక్కచేయలేదు. –సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం
● జనజాతరను తలపిస్తున్న వైఎస్సార్ ఆసరా సభలు ● జగనన్నకు అక్కచెల్లెమ్మల దీవెనలు
ఆత్మగౌరవం పెంచేందుకే...
మహిళల ఆత్మగౌరవం పెంచేందుకే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆసరా పథకాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. మహిళలకు మరింత ఊతం ఇచ్చేందుకే ఈ ఆసరా. మేలు చేసే ప్రభుత్వానికి అందరూ మద్దతుగా నిలవాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మహిళల మీద నమ్మకం ఉంది.. రానున్న రోజుల్లో మీ అండదండలు ఆయనకు ఉండాలి. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా రుణాల రద్దుకు కార్యాచరణ రూపొందించి, ఇప్పటికే మూడు విడతల్లో నగదును చెల్లించిన విషయాన్ని గుర్తించాలి. నిత్యం కుటుంబా న్ని మోసే మహిళలకు అండగా ఉండేందుకు.. వారి బాధ్యతల్లో ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఆసరా ఉపయోగపడుతుంది. సీఎం జగన్ డబ్బుల ను వృథా చేస్తున్నారని విపక్షాలు అంటున్నాయి. ఆ దుష్ప్రచారాన్ని మీరంతా తిప్పికొట్టాలి.
– ధర్మాన ప్రసాదరావు, రెవెన్యూ శాఖ మంత్రి
(గార మండలంలో నిర్వహించిన ఆసరా పంపిణీలో)

సరుబుజ్జిలి: ఆసరా చెక్కుల పంపిణీకి హాజరైన స్వయం సహాయక సంఘ సభ్యులు