
మాట్లాడుతున్న డీఎంలు మాధవ, శర్మ
శ్రీకాకుళం అర్బన్: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బస్సులు నడుపుతున్నామని, పల్లెవెలుగు బస్సుల్లో హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల మేనేజర్లు కె.మాధవ్, కె.ఎస్.ఆర్ శర్మ తెలిపారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకుని ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. విద్యా ర్థులకు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎ.విజయ్‌కుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు.