
పుట్ పాత్‌పై విక్రయానికి ఉంచిన మట్టి కుండలు
ఆరోగ్యకరం..
35 ఏళ్లుగా వారపు సంతల్లో మట్టి కుండలు అమ్ముతున్నాను. 20 ఏళ్లు కిందట తాగునీటికి, వంటలు చేసుకునేందుకు మాత్రమే మట్టికుండలు వాడే వారు. ఇప్పుడు శుభకార్యాలకు, పూజలకు మాత్రమే మొక్కుబడిగా తీసుకెళ్తున్నారు. వేసవిలో మాత్రం అధికంగా అమ్ముడుపోతున్నాయి. మట్టి కుండ వంటకాలు, తాగునీరు ఆరోగ్యకరం. నేను ఇప్పటికీ మా ఇంటిలో మట్టి కుండలనే వాడుతున్నాను.
– కె.ముత్యాలమ్మ, కుండల తయారీదారు, తెంబూరు
విక్రయాలు బాగున్నాయి..
మట్టి కుండలకు మళ్లీ ప్రాధాన్యం పెరిగింది. ముఖ్యంగా వేసవి సీజ న్లో చలివేంద్రాలు, మట్టికుండల్లో వంటలు చేసేందుకు ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. మా వద్ద ట్యాప్ ఉన్న మట్టి కుండలు ఉన్నాయి. సైజును బట్టీ ఒక్కోటి రూ.550 ధరకు అమ్ముతున్నాం. – కె.వేణు, కుండల విక్రయదారుడు, కాశీబుగ్గ


