
పూరీ కళాకారుల నృత్య ప్రదర్శన
కాశీబుగ్గ: జగన్నాథ సంస్కృతిని విస్తరింప చేయాలని ఒడియా సంఘ అధ్యక్షుడు శివాజీ పాణిగ్రాహి అన్నారు. కాశీబుగ్గ బృందావన చంద్ర ఆలయంలో 87వ ఒడిశా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా ఒడియా బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒడియా సంస్కృతి, ఆచారాలను కొనసాగించేలా చూడాలన్నారు. ఒడియా భాషా ఔన్నిత్యాన్ని వివరించారు. ఒడియా సంఘ అభివృద్ధి సభ్యుడు సత్యనారాయణ పాడి, జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ త్యాడి భవిష్యత్తులో సంఘం అభివృద్ధికి చేపట్టనున్న ప్రణాళికలు వివరించారు. అనంతరంకి పూరీకి చెందిన నృత్య కళాకారుల ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. కార్యక్రమంలో మందస, పలాస, శ్రీకాకుళం సంఘ నాయకులు హాజరయ్యారు.