
పాతపట్నం: పతకం స్వీకరిస్తున్న సోనియా
పాతపట్నం, హిరమండలం: జాతీయస్థాయి కుస్తీ పోటీల్లో పాతపట్నం, హిరమండలం మండలాలకు చెందిన యువతులు ప్రతిభకనబర్చారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం దివాస్‌లోని శ్రీమంత్ టుకోజిరో పవర్ స్పోర్ట్స్ స్టేడియంలో నేషనల్ జూ–జిస్ట్ చాంపియన్ షిప్–2022–23 ఆధ్వర్యంలో మార్చి 30, 31వ తేదీలో జాతీయస్థాయి కుస్తీ పోటీలు జరిగాయి. ఇందులో పాల్గొన్న పాతపట్నం శివశంకర్ కాలనీకి చెందిన చెందిన నల్ల సోనియా, హిరమండలం మండలం గులుమూరు పంచాయతీ చాపరాయిగూడకు చెందిన బిడ్డికి చామంతి ప్రతిభ కనబర్చి సిల్వర్ పతకాలు సాధించారు. గతంలో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో తైక్వా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆలిండియా కరాటే చాంపియన్‌షిప్ పోటీల్లో కూడా నల్ల సోనియా 56 కేజీల విభాగంలో బంగారు పతకాన్ని సాధించింది.
అలాగే విశాఖపట్నంలో తైక్వా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరో ఇంటర్‌నేషనల్ కరాటే చాంపియన్‌షిప్–2023లో 56 కేజీల విభాగంలో రజక పతకం సాధించింది. హిరమండలం మండలం సుభలయ గ్రామానికి చెందిన సింహచలం వద్ద సోనియా శిక్షణ పొందింది. చామంతి కూడా వివిధ పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించింది.

హిరమండలం: సిల్వర్ మెడల్ అందుకుంటున్న చామంతి