నేర నియంత్రణకు పటిష్ట చర్యలు | - | Sakshi
Sakshi News home page

నేర నియంత్రణకు పటిష్ట చర్యలు

Apr 2 2023 1:42 AM | Updated on Apr 2 2023 1:42 AM

నెలవారీ నేరసమీక్షా సమావేశంలో 
మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ రాధిక  
 - Sakshi

నెలవారీ నేరసమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ రాధిక

శ్రీకాకుళం క్రైమ్‌: నేర నియంత్రణకు నిఘా నేత్రం (సీసీ కెమెరాల)తో పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ జి.ఆర్‌.రాధిక పోలీసు అధికారులకు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాధిక అధ్యక్షతన నెలవారీ నేర సమీక్షా సమావేశం శనివారం జరిగింది. ముందుగా స్పందన ఫిర్యాదులు, ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు, తీవ్ర నేరాలు (గ్రేవ్‌ కేసులు), ఎన్టీపీఎస్‌ యాక్ట్‌, ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసుల్లోని పలు అంశాలపై సమీక్ష నిర్వహించి ముఖ్యమైన కేసుల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని ముఖ్యకూడళ్లలో బంగారం దుకాణాలు, వ్యాపార సంస్థలు, అపార్ట్‌మెంట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కొన్ని తరహా నేరాలు ఛేదించడంలో సీసీ పుటేజీ కీలకమన్నారు. మహిళా పోలీసులతో క్షేత్రస్థాయిలో ఎమ్‌ఆధార్‌ యాప్‌లో బయోమెట్రిక్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సర్వీసులో డబ్బు పోగొట్టుకునే విధానం, సైబర్‌ నేరాలు, రోడ్డు భద్రతా నియమాలు, అక్రమ రవాణా, అక్రమ వ్యాపారుల వలన కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలన్నారు. నార్కోటిక్‌ డ్రగ్స్‌ కేసుల్లో ప్రాపర్టీ సీజింగ్‌, కేసు దర్యాప్తు, ముద్దాయిల అరెస్టులో జాగ్రత్తలను పాటిస్తూ ముద్దాయిలకు జైలు శిక్ష పడేలా చేయాలన్నారు. అపరిష్కృతంగా ఉన్న కేసులపై దృష్టిసారించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిశితమైన సాక్ష్యాధారాలు సేకరించాలని, 60 రోజుల్లోగా దర్యాప్తు పూర్తిచేసి కేసుకు సంబంధించిన అన్ని రకాలైన పత్రాలతో కోర్టులో అభియోగం పత్రాలను దాఖలు చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, పోక్సో వంటి ముఖ్య కేసులన్నింటిలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సాక్ష్యాధారాల సేకరణలో, సాక్షుల విచారణలో జాగ్రత్తలు పాటిస్తూ ప్రాంతీయ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు ఽఆధారాలు పంపించాలన్నారు. వారిచ్చిన అభిప్రాయాల మేరకు నిర్ణీత గడువులోగా దర్యాప్తును పూర్తిచేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేయాలన్నారు. సాంకేతికతతో త్వరితగతిన సైబర్‌ కేసులను దర్యాప్తు చేయాలని, మహిళా పోలీసులను సమన్వయం చేసుకుంటూ దిశ యాప్‌, సైబర్‌ మోసాలపై గ్రామ, పట్టణ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శ్రీకాంత్‌, అదనపు ఎస్పీ టి.పి.విఠలేశ్వరరావు, డీఎస్పీలు ఎం.మహేంద్ర, సీహెచ్‌ ప్రసాదరావు, ఎస్‌.వాసుదేవ్‌, జి.శ్రీనివాసరావు, ఎం.శివరామరెడ్డి, కె.బాలరాజు, డి.ప్రసాదరావు, ఏవో ఎం.శివరామరాజు, సీఐలు, వివిధ పోలీసు స్టేషన్ల ఎస్సైలు పాల్గొన్నారు.

సమీక్ష సమావేశంలో ఎస్పీ జి.ఆర్‌.రాధిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement