
రైతు నాటికలో చిన్నారుల ప్రదర్శన
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): చిన్నారులను చదువుతోపాటు క్రమశిక్షణ, శాస్త్రసాంకేతిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో సైతం ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడమే ట్వింకిల్ కిడ్స్ స్కూల్ లక్ష్యమని ప్రముఖ వైద్యుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ట్వింకిల్ కిడ్స్ స్కూల్ 10వ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు పాటలకు డ్యాన్స్‌లు చేసి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో రాఘవదాస్, సుగుణాకర్, అంధవరపు రమేష్, డాక్టర్ కొర్ల విద్యాసాగర్, డాక్టర్ కర్రి లక్ష్మీసౌజన్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.