విపత్తులో రక్షణ..
శనివారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2023
ఎంతటి కఠిన సవాళ్లనైనా ఎదుర్కోవడం.. శత్రు మూకల్లోకి చొచ్చుకుపోయి.. వారి వ్యూహాలను చిన్నాభిన్నం చేయడం కమాండోలు ప్రత్యేకత. జిల్లా పోలీసుదళంలో కూడా అటువంటి కఠోర శిక్షణ పొందిన కమాండోలు ఉంటే బాగుంటుందని భావించిన ఎస్పీ రాధిక స్పెషల్ టాస్క్ ఫోర్స్ నుంచి మెరికల్లాంటి వారిని ఎంపిక చేసి ఆక్టోపస్ కమాండోలతో స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (స్వాట్)లో శిక్షణ ఇప్పించారు. శ్రీకాకుళం జిల్లాలోనే ఈ శిక్షణ ఇవ్వడం ముదావహమని డీఐజీ హరికృష్ణ ప్రశంసించారు.