
మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి
శ్రీకాకుళం అర్బన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగానే రాహుల్‌గాంధీపై కేసులు బనాయించిందని డీసీసీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి అన్నారు. శ్రీకాకుళంలోని ఇందిరా విజ్ఞానభవన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆదాని ఆస్తులు రాత్రికి రాత్రే ఎలా రెట్టింపయ్యాయని రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో నిలదీసినందుకే అక్రమ కేసులని పెట్టారని ఆరోపించారు. భారత్ జోడో పాదయాత్రకు వచ్చిన ప్రజాదరణ చూసి ఓర్వలేని మోదీకి భయం పట్టుకుందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డి.గోవిందమల్లిబాబు, కృష్ణ, పైడి నాగభూషణరావు, షణ్ముఖరావు, రెల్ల సురేష్, రాజేశ్వరరావు, ఎ.దాలినా యుడు, సాయిరాం, జి.అప్పారావు పాల్గొన్నారు.