
వారణాసి జనార్దనరావు (ఫైల్)
టెక్కలి రూరల్: మండలంలోని వలేసాగరం జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశా రాష్ట్రం బరంపురం ప్రేమ్‌నగర్ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వారణాసి జనార్దనరావు(70) అనే రిటైర్డ్ అధ్యాపకుడు మృతిచెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...జనార్దనరావు తన భార్య ఉషారాణితో కలిసి శుక్రవారం ఉదయం బరంపురం నుంచి పలాస ట్రైన్‌లో వచ్చారు. అక్కడి నుంచి తన బంధువులతో కలిసి కారులో విశాఖపట్నం వైపు వెళ్తుండగా టెక్కలి సమీపంలోని వలేసాగరంఫ్‌లై ఓవర్‌పై వ్యక్తిగత పని నిమిత్తం కారు దిగారు. తిరిగి కారు ఎక్కుతుండగా పలాస నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న ఐషర్ వ్యాన్ అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జనార్దనరావును టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో 108లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలిస్తుండగా కోటబొమ్మాళి సమీపంలో మృతిచెందారు. మృతదేహాన్ని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చి శవపంచనామానిర్వహించారు. ఈ ఘటనపై టెక్కలి ఎస్‌ఐ–2 రమేష్‌బాబు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..