
నువ్వుల సాగుపై రైతులకు సూచనలిస్తున్నకేవీకే శాస్త్రవేత్తలు
ఆమదాలవలస రూరల్: సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి అన్నారు. నిమ్మతొర్లాడ గ్రామంలో చెరకు, నువ్వుల పంటల సాగును మంగళవారం పరిశీలించి రైతులకు పలు సూచనలందించారు.
నువ్వులపంటలో అధిక దిగుబడులు ఇచ్చే వైఎల్‌ఎం 66 రకంపై క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. ఎండు తెగులు వచ్చినందున చనిపోయినట్లు మొక్కలు కనిపిస్తున్నాయని, దీని నివారణకు లీటర్ నీటికి మూడు గ్రాముల సాఫ్ గానీ, కాప్రాక్సీక్లోరైడ్ 200 లీటర్ల మందు గానీ పిచికారీ చేయాలని తెలియజేశారు. చెరకులో కొరడా తెగులు నివారణకు లీటరు నీటికి మిల్లీలీటర్ ప్రాపికోనజోల్ మందును కలిపి చేను మొత్తం తడిచేలా పిచికారీ చేయాలన్నారు. కార్యక్రమంలో విస్తరణ శాస్త్రవేత్త ఎస్.నీలవేణి, ఎస్.అనూష. ఎస్.కిరణ్‌కుమార్, వీఏఏ లావణ్య, రైతులు పాల్గొన్నారు.