
రిలే శిబిరంలో జెడ్పీటీసీ వసంతరెడ్డి, పోరాట కమిటీ నాయకులు
సంతబొమ్మాళి: కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్‌కు సంబంధించిన జీఓ 1108 రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదని థర్మల్ పవర్‌ప్లాంట్ వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. సంతబొమ్మాళి మండలం పోతునాయుడుపేటలో అమరవీరుల 12వ వర్ధంతి సందర్భంగా స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వడ్డితాండ్ర దీక్ష శిబిరంలో సమావేశం నిర్వహించారు. అమరులైన సీరపు నాగేశ్వరరావు, బత్తిని బారికయ్య, సీరపు యర్రయ్యలకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పోరాట కమిటీ అధ్యక్షుడు మండల గన్ను మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే జీఓ 1108 రద్దు చేయానలి, కాకరాపల్లి తంపర భూములు స్వదేశీ మత్స్యకారులకు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పాల వసంతరెడ్డి, పోరాట కమిటి నాయకులు అనంతు హున్నారావు, ఎస్.వెంకటరావు, ఎస్.రాజరావు, కేశవ పాల్గొన్నారు.