పాలబావిలో గంగ పూజ చేస్తున్న భక్తులు
కొల్హాపురి మహాలక్ష్మీ మూలవిరాట్
రొళ్ల: మండలంలోని రత్నగిరి గ్రామంలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాలు మంగళవారం సాయంత్రం ముగిశాయి. ఈ నెల 5నుంచి మంగళవారం సాయంత్రం వరకూ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సోమవారం అర్ధరాత్రి పోతులరాజు బండారు మహోత్సవం సందర్భంగా ఉత్సవమూర్తిని పురవీధుల్లో ఊరేగించారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆలయంలో విశేష పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలల నుంచే కాక, కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. పాలబావిలో గంగ పూజల నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. దాతల సహకారంతో ప్రసాద వినియోగం చేశారు. కార్యక్రమంలో రత్నగిరి సంస్థాన రాజవంశీకుడు దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు, కై వాడస్తులు, తదితరులు పాల్గొన్నారు. కాగా, అమ్మవారికి ప్రీతికరమైన మంగళవారం నాడు బ్రహ్మోత్సవాలు ముగిసిన తరుణంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయ సమీపంలో విందు భోజనాలు ఏర్పాటు చేసి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో కలిసి ఆరగించారు.


