‘సర్దార్’ జీవితం స్ఫూర్తిదాయకం
పుట్టపర్తి టౌన్: దేశ సమగ్రత, ఐక్యతకు కృషి చేసిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని యువతకు ఎస్పీ సతీష్‌కుమార్ సూచించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఏక్తా ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం డీపీఓలో సర్దార్ వల్లబాయ్ పటేల్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఐక్యత యెక్క ప్రాముఖ్యతను చాటుతూ దేశ సమగ్రత కోసం పటేల్ చేసిన కృషిని ఎస్పీ కొనియాడారు. అనంతరం దేశ సమైక్యత, భధ్రత కాపాడుతామని పోలీసులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ విజయకుమార్, సీఐలు శివాంజనేయులు, సురేష్, ఆర్‌ఐలు మహేష్, వలి, రవికుమార్, డీసీఆర్‌బీ సీఐ శ్రీనివాసులు, ఆర్‌ఎస్‌ఐలు వీరన్న, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


