196 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
అమరాపురం: అక్రమంగా కర్ణాటకు తరలిస్తున్న 196 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శుక్రవారం అమరాపురం మండలం చిట్నడుకు క్రాస్ వద్ద విజిలెన్స్ సీఐ సద్గురుడు, సీఎస్‌డీటీ నవీన్‌కుమార్, ఏఈఈ రవీంద్రనాథ్ స్వాధీనం చేసుకున్నారు. ఐచర్ వాహనంలో 345 బస్తాల్లో పట్టుబడిన 196.35 క్వింటాళ్ల రేషన్ బియాన్ని స్టాక్ పాయింట్‌కు తరలించారు. వాహనాన్ని సీజ్ చేశారు. కర్ణాటకకు చెందిన డ్రైవర్ ఆకుల మారుతి, బియ్యం వ్యాపారి పావగడకు చెందిన ఎనుమడి సేతురం, వాహన యాజమాని వెంకటేష్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.


