గానప్రియా.. భళా
● దేశరాజధానిలో గళం వినిపించిన
ధర్మవరం విద్యార్థిని
ధర్మవరం అర్బన్: మండలంలోని రాంపురంకు చెందిన విద్యార్థిని మధుటూరి గానప్రియ దేశరాజధాని ఢిల్లీలో తన గళం వినిపించారు. గ్రామానికి చెందిన శ్రీనివాసులు, భాగ్యలక్ష్మి దంపతుల కుమార్తె గానప్రియ ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పార్లమెంట్ ప్రాంగణంలోని రాజ్యాంగ భవనంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొంది. ఇప్పటికే మంచి వక్తగా పేరుతెచ్చుకున్న గానప్రియ... పటేల్ గొప్పతనంతోపాటు మన దేశ గొప్పతనాన్ని, సింధూర్ యుద్ధంలో సైనికుల పోరాటంతో దక్కిన విజయం గురించి అనర్గలంగా మాట్లాడి అందరినీ మన్ననలు పొందింది.


