
పోలీస్ అమరవీరులకు వందనం
పుట్టపర్తి టౌన్: అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ శాంతిభద్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంలో పోలీసులది కీలక పాత్ర. ప్రజలకు రక్షణ కల్పించే క్రమంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి వారి సేవలను స్మరించుకునేందుకు ఏటా అక్టోబర్ 21న పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు జోహార్లు అర్పిస్తూ స్మారకోత్సవాలను ఘనంగా నిర్వహించేలా జిల్లా పోలీసు శాఖ ఏర్పాట్లు చేసింది. రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్‌లోనూ అమరులైన పోలీసులకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు. అలాగే జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 7.30 నుంచి 10గంటల వరకు సమావేశం నిర్వహించి ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించనున్నారు.
ఆ త్యాగం మరువలేం
భారత, చైనా సరిహద్దులోని లడక్ ప్రాంతంలో 1959 అక్టోబరు 21న చైనా సైనికుల దాడిలో పది మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు నేలకొరిగారు. వారి మృతదేహాలను సొంత ప్రాంతాలకు తరలించలేని పరిస్థితి. దీంతో అక్కడే ఖననం చేశారు. వారి త్యాగాలకు గుర్తుగా అప్పటి నుంచి ఏటా అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. పది రోజుల పాటు సాగే పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలను చేపట్టనున్నారు. 21న జిల్లా పోలీసు కార్యాలయంలో కార్యక్రమాన్ని ఎస్పీ సతీష్‌కుమార్ ప్రారంభించనున్నారు. 22, 23తేదీల్లో జిల్లాలో అమరులైన పోలీసుల గ్రామాలను సందర్శించి, నివాళులర్పించనున్నారు. అనంతరం 24 నుంచి 27వ తే9దీ వరకూ విద్యార్థులకు చర్చావేదికలు, వక్తృత్వ పోటీలు, 26న 26న పోలీసుల పరాక్రమాలు, త్యాగాలు తెలిపే చిత్రాల ప్రదర్శన, 26 నుంచి 27 వరకు ఓపెన్ హౌస్, 28న వైద్య శిభిరాలు, అదే రోజు పోలీస్ వాయిద్య బృందాల ప్రదర్శన, 29న పోలీస్ త్యాగాలపై సెమినార్లు, 30న పోలీస్ అమరవీరుల కుటుంబాల్లోని సాధకులకు సన్మానం, 31న సమైక్యతా దినం పాటించి వారోత్సవాలు ముగించనున్నారు.
జిల్లాలో ఇద్దరు అమరులు
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణతో భాగంగా కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, బాబావలి అమరులయ్యారు. 1992లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఎంపికై న ఆర్.బాబావలి... హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో ఉన్న పోలీస్ కారిడార్‌లో గన్‌మెన్‌గా శిక్షణ పొంది పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలకు అంగరక్షకుడిగా పనిచేశారు. 2003, జనవరి 18న అనంతపురంలో గుర్తు తెలియని దుండగుల చేతిలో వీరమరణం పొందారు. ఆయన సేవలకు గుర్తుగా ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించి, ఆయన భార్యకు ఎకై ్సజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం కల్పించింది. అలాగే 1994లో కానిస్టేబుల్‌గా విధుల్లోకి చేరిన తాటిపి చంద్రశేఖర్.. చిలమత్తూరు, రామగిరి పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. 2003, సెప్టెంబర్ 23న చంద్రశేఖర్‌తో పాటు మరో కానిస్టేబుల్ హనుమంతును మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఆ తరువాత హనుమంతుని విడుదల చేశారు. ఆ మరుసటి రోజు సోమరవాండ్లపల్లి అటవీ ప్రాంతంలో చంద్రశేఖర్ మృతదేహం లభించింది. అమరుడైనా చంద్రశేశేఖర్ కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించింది.
మీ త్యాగాలు మరవలేం
శాంతిభద్రత నిర్వహణలో
పోలీసుల పాత్ర కీలం
రేపు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం
పోలీస్ అంటేనే బాధ్యత
పోలీస్ ఉద్యోగం అంటే బాధ్యతతో కూడుకున్నది. ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణలో భాగంగా కొన్నిసార్లు అసాంఘిక శక్తుల చేతుల్లో వీరమరణం పొందక తప్పదు. వారి త్యాగాలు గుర్తు చేసుకొనేందదుకు పోలీసుల అమరవీరుల దినోత్సవం నిర్వహిస్తున్నాం ఈ నెల 31 వరకు అన్ని పోలీస్ స్టేషన్లలో అమరవీరుల వారోత్సవాలు జరుగుతాయి.
– సతీష్‌కుమార్, ఎస్పీ

పోలీస్ అమరవీరులకు వందనం

పోలీస్ అమరవీరులకు వందనం

పోలీస్ అమరవీరులకు వందనం