
పుట్ట గొడుగుల పెంపకం లాభదాయకం
బుక్కరాయసముద్రం: పుట్ట గొడుగుల పెంపకం లాభదాయమని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి, జిల్లా వ్యవసాయ అధికారి ఉమా మహేశ్వరమ్మ సూచించారు. మండలంలోని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో పుట్ట గొడుగుల పెంపకంపై శిక్షణ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్‌లో పుట్ట గొడుగులకు డిమాండ్ ఉందన్నారు. నిరుద్యోగ యువత పుట్ట గొడుగుల పెంపకంపై శిక్షణ పొంది కుటీర పరిశ్రమలాగ అభివృద్ధి చేసుకోవాలన్నారు. అనంతరం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి పుట్ట గొడుగుల పెంపకంలో మెలకువలు, యాజమా న్య పద్ధతులపై అవగాహన కల్పించారు. అనంతరం శిక్షణ పొందిన యువతకు సర్టిఫికెట్లు అందజేశారు.
జీవన ఎరువుల వాడకం ఎంతో మేలు
రసాయన మందులకంటే జీవన ఎరువులు వాడకం ఎంతో మేలు అని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి సూచించారు. మండలంలోని రెడ్డిపల్లి కేవీకేలో జీవన ఎరువుల వారోత్సవాల సందర్భంగా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సస్య ఉత్పత్తి శాస్త్రవేత్త డాక్టర్ శశికళ జీవన ఎరవుల వాడకంపై అవగాహన కల్పించారు. వ్యవసాయ విస్తరణ, ఎరువుల లభ్యత, పథకాలపై కేవీకే విస్తరణా శాస్త్రవేత్త చందన అవగాహన కల్పించారు. ఉద్యాన పంటల సాగుపై వాటిలో రాయితీలపై శాస్త్రవేత్త డాక్టర్ మాధవి వివరించారు. కార్యక్రమంలో కేవీకే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.