
మారుతి సుజుకి– నివ్యా ఆటోమొబైల్స్‌షోరూం ప్రారంభం
అనంతపురం సెంట్రల్: నగర శివారులోని శిల్పారామం వద్ద జాతీయ రహదారి పక్కన కొత్తగా ఏర్పాటు చేసిన ‘మారుతి సుజుకి అరెనా–నివ్యా ఆటో మొబైల్స్ షోరూం’ను ఆదివారం అట్టహాసంగా ప్రారంభించారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా హీరోయిన్ మీనాక్షి చౌదరి ముఖ్య అతిథిగా హాజరై అలరించారు. సినిమా పాటకు స్టెప్పులేసి అదరగొట్టారు. ఆమెను చూడటానికి యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం మారుతి సుజుకి మిడ్ – ఎస్‌యూవీ విక్టోరిస్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ మారుతి సుజుకి మొదటి నుంచి ఎంతో నమ్మకమైన బ్రాండ్ అన్నారు. తన ప్రయాణం చిన్నప్పుడు మారుతి 800తో మొదలైందని గుర్తు చేసుకున్నారు. జీవితమనేది చాలా విలువైనదని, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎంపీ అంబికా లక్ష్మినారాయణ మాట్లాడుతూ తొలిసారిగా పెట్రోల్ కార్లను మారుతి సంస్థ ప్రవేశపెట్టడం గొప్ప విషయమన్నారు. నివ్యా ఆటో మొబైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లు ప్రసాద్‌రెడ్డి, మల్లు నివేదితా రెడ్డి మాట్లాడుతూ కొత్త అరెనా షోరూమ్‌లో సేల్స్, సర్వీస్, స్పేర్ పార్ట్స్ అన్నీ ఒకేచోట లభిస్తాయని తెలిపారు. నూతన మారుతి సుజుకి విక్టోరిస్ కారు స్ట్రాంగ్ హైబ్రిడ్, మైల్డ్ హైబ్రిడ్, సీఎన్‌జీ, ఆల్‌గ్రిప్ వేరియంట్లలో అందుబాటులో ఉందన్నారు. దీని ధర రూ.10.49 లక్షల నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.
మెరిసిన సినీనటి మీనాక్షి చౌదరి