
అప్రమత్తంగా ఉండాలి
ఆన్‌లైన్‌లో వచ్చే ఉద్యోగ ప్రకటనలు చూసి మోసపోవద్దు. యువత నైపుణ్యం పెంచుకోవడానికి కోచింగ్ సెంటర్లకు వెళ్లి కొత్త కోర్సులు అభ్యసించాలి. సాధారణంగా ప్రముఖ సంస్థలు ఎప్పుడూ రిజిస్ట్రేషన్ ఫీజు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫీజు పేరిట నగదు వసూలు చేయవు. జాబ్ స్కామర్ల ప్రకటనల్లో, ఈ మెయిల్స్‌లో ఎక్కువగా గ్రామర్ తప్పులు ఉంటాయి. జాబ్ డిస్క్రిప్షన్ కూడా అస్పష్టంగా ఉంటుంది. క్విక్ మనీ, అన్‌లిమిటెడ్ ఎర్నింగ్స్, ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు అనే పదాలపై అప్రమత్తంగా ఉండాలి. మోసపోయామని గ్రహిస్తే సమీప పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. – సీఐ రెడ్డెప్ప, టూ టౌన్ పోలీస్ స్టేషన్, ధర్మవరం
●