
రాష్ట్రంలో నిరంకుశ పాలన
రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోంది. ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరిన వారిపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారు. చివరకు ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన పత్రికలపైనా పోలీసులను ప్రయోగిస్తున్నారు. హైదరాబాద్‌లోని ‘సాక్షి’ కార్యాలయంలో నెల్లూరు పోలీసులు మితిమీరి ప్రవర్తించారు. జర్నలిస్టులను భయపెట్టి గుప్పిట్లో పెట్టుకోవాలనే కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోంది. ప్రజాస్వామ్యవాదులంతా ఈ చర్యలను ఖండించాలి.
– ఉషశ్రీ చరణ్, జిల్లా అధ్యక్షురాలు,
వైఎస్సార్ సీపీ