
కొనసాగుతున్న వర్షాలు
పుట్టపర్తి అర్బన్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో మూడోరోజూ జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకూ జిల్లాలోని 17 మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో అగళిలో 11.6 మి.మీ, నల్లమాడలో 9.8, బుక్కపట్నం 9.4, కొత్తచెరువు 9.4, గాండ్లపెంటలో 9, చిలమత్తూరులో 7.8, పుట్టపర్తిలో 7.6, నల్లచెరువులో 4.4, కదిరిలో 4.2, లేపాక్షిలో 4.2, ధర్మవరంలో 3.4, గుడిబండలో 3, రొద్దంలో 2.8, ఓడీ చెరువులో 2.4, సోమందేపల్లిలో 1.4, బత్తలపల్లిలో 1.2, అమరాపురంలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది.