మహిళను బలిగొన్న కరెంట్‌ షాక్‌ | - | Sakshi
Sakshi News home page

మహిళను బలిగొన్న కరెంట్‌ షాక్‌

May 22 2025 12:59 AM | Updated on May 22 2025 12:59 AM

మహిళన

మహిళను బలిగొన్న కరెంట్‌ షాక్‌

మడకశిరరూరల్‌: దిగువ అచ్చంపల్లికి చెందిన మహిళ పుష్పావతి (36) బుధవారం సాయంత్రం విద్యుదాఘాతంతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇంటి ఆవరణలో సింగిల్‌ పేజ్‌ మోటార్‌ ఆన్‌ చేసి సంపు వద్ద నీటిని పట్టుకోవడానికి వెళ్లే సమయంలో పుష్పావతి కరెంట్‌ షాక్‌కు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు మడకశిర ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఈమెకు భర్త, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈమె మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వం మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

అక్షితకు ‘షైనింగ్‌ స్టార్‌’ అవార్డు

అమరాపురం: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో హలుకూరు సమీపంలోని కేజీబీవీ విద్యార్థిని అక్షిత 600కు 586 మార్కులతో రాష్ట్రంలోనే కేజీబీవీల్లో రెండో స్థానంలో నిలిచి ‘షైనింగ్‌ స్టార్‌’ అవార్డుకు ఎంపికై ంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ చేతుల మీదుగా విద్యార్థినికి అవార్డును అందజేసినట్లు ప్రిన్సిపాల్‌ శోభారాణి తెలిపారు. మారుమూలన, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో చదువుకున్న విద్యార్థినికి అత్యుత్తమ మార్కులు సాధించడం పట్ల మంత్రి ప్రశంసల జల్లు కురిపించారని పేర్కొన్నారు. ఈమె తల్లిదండ్రులు చిత్తయ్య, ఎర్రక్కలు కుందుర్పి మండలం నిజవల్లి గ్రామానికి చెందిన వారన్నారు. అవార్డు అందుకున్న సందర్భంగా కేజీబీవీ టీచర్లు, సిబ్బంది అక్షితను అభినందించారు.

అదనపు కట్నం వేధింపుౖలపె కేసు

హిందూపురం: అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న భర్త సయ్యద్‌ అతావుల్లాపై వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మూడేళ్ల క్రితం హస్నాబాద్‌లో నివాసముంటున్న సానియాతో అతావుల్లాకు వివాహమైంది. వివాహ సమయంలో ఆమె తల్లిదండ్రులు వరకట్నం తదితర కానుకలను అందజేశారు. అయినా ఇంకా అదనపు కట్నం కావాలని అతావుల్లా వేధిస్తుండటంతో భరించలేకపోయిన భార్య వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసునమోదు చేసి, అతావుల్లాను అరెస్టు చేశారు.

ఎమ్మెల్యేలా.. వీధిరౌడీలా?

అనంతపురం కార్పొరేషన్‌: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎంఎస్‌ రాజు, అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ జిల్లాపరిషత్‌ కార్యాలయంలో వీధి రౌడీల్లా ప్రవర్తించారని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు విమర్శించారు. బుధవారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ చాంబర్‌లో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోను తొలగించాలంటూ అధికారులపై హుకుం జారీ చేయడమేంటని ప్రశ్నించారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడా లేదని పేర్కొన్నారు. అధికారులను బెదిరిస్తూ దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్‌ రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోందనడానికి ఇదొక నిలువెత్తు సాక్ష్యమని అభివర్ణించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు.

హెచ్చెల్సీ ఎస్‌ఈగా పురార్థనరెడ్డి

అనంతపురము సెంట్రల్‌: హెచ్చెల్సీ ఎస్‌ఈగా పురార్థనరెడ్డి నియమితులయ్యారు. నంద్యాల జిల్లా ఎస్‌ఆర్‌ బీసీ ప్రాజెక్ట్‌ సర్కిల్‌ –1 ఎస్‌ఈగా పని చేస్తున్న ఈయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా గత నెలాఖరులో హెచ్చెల్సీ ఎస్‌ఈ రాజశేఖర్‌ ఉద్యోగ విరమణ పొందారు. అయినప్పటికీ ఎస్‌ఈ నియామకం జరగక పోవడంతో ఈ నెల 13న ‘ప్రగతి తప్పిన హెచ్చెల్సీ’ శీర్షికన సాక్షిలో కథనం వెలువడటంతో ఉన్నతాధికారులు స్పందించి ఇన్‌చార్జ్‌ (ఎఫ్‌ఏసీ) ఎస్‌ఈగా పురార్థనరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు.

మహిళను బలిగొన్న కరెంట్‌ షాక్‌ 1
1/2

మహిళను బలిగొన్న కరెంట్‌ షాక్‌

మహిళను బలిగొన్న కరెంట్‌ షాక్‌ 2
2/2

మహిళను బలిగొన్న కరెంట్‌ షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement