
ఫొటోల కోసం పాకులాడటమేంటి?
అనంతపురం కార్పొరేషన్: అభివృద్ధి మరచి ఫొటోల కోసం పాకులాడటం ఏంటని వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి పేర్కొన్నారు. జెడ్పీలో చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ చాంబర్‌లో ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్ర బాబు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చర్యలను ఆయన ఖండిస్తూ బుధవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించారన్నారు. జిల్లాలో హంద్రీ–నీవా, ఆర్డీటీ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అటువంటివాటిపై పాలకులు నోరు మొదపకుండా దిగుజారుడు రాజకీయాలకు పాల్పడడం ఏంటని నిలదీశారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించారన్నారు. ఉపాధి హామీ పనుల అవినీతిపై చర్చ జరిపిన పాపాన పోలేదన్నారు. ఓ బీసీ మహిళా ప్రజాప్రతినిధి చాంబర్‌లోకి వెళ్లి హంగామా చేయడమే కాకుండా జెడ్పీ సీఈఓపై దబాయించడమేంటన్నారు.