
కేబుల్ దొంగల అరెస్టు
పావగడ: తిరుమణి సోలార్ పార్క్‌కు చెందిన వళ్లూరు గ్రామం అవధా సోలార్ ప్లాంట్‌లో కేబుల్ అపహరించిన దొంగలు పోలీసులకు చిక్కారు. రూరల్ సీఐ గిరీశ్ వివరాల మేరకు.. జనవరి 20న రాత్రి అవధా సోలార్ కంపెనీ సోలార్ ప్యానల్‌కు ఏర్పాటు చేసిన సుమారు రూ .2 లక్షల విలువ చేసే సుమారు 2,500 మీటర్ల డీసీ కేబుల్ వైరు చోరీకి గురైందన్నారు. దొంగతనానికి పాల్పడ్డ పావగడ పట్టణంలోని ఆఫ్ బండ ప్రాంతానికి చెందిన చోరులు మల్లేష్ అలియాస్ మల్లికార్జున, బాబు అలియాస్ బాబురావ్, మంజ అలియాస్ అణ్ణప్పలను అరెస్ట్ చేశామన్నారు. వారి నుంచి డీసీ కేబుల్‌తో దొంగతనానికి ఉపయోగించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న నాగరాజును త్వరలో పట్టుకుంటామన్నారు.