
‘సూర్యఘర్’తో విద్యుత్ బిల్లు ఆదా
పుట్టపర్తి టౌన్: ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకం కింద ఇంటిపై కప్పుపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ బిల్లులు ఆదా అవుతుందని కలెక్టర్ టీఎస్ చేతన్, ఎమ్మెల్యే సింధూరారెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక సాయిఆరామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై అవగాహన కల్పించారు. అనంతరం సోలార్ విద్యుత్ స్టాల్స్‌ను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... కిలోవాట్ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటే 120 యూనిట్లు కరెంట్ ఆదా అవుతుందన్నారు. ప్రభుత్వం రాయితీ కూడా ఇస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకొని విద్యుత్‌పొదుపుతో పాటు బిల్లులు కూడా తగ్గించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్‌ఈ సంపత్‌కుమార్, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, విద్యుత్ శాఖ డీఈలు శివరాములు, మోసస్‌పాటు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.