
అధినేతతో రామగిరి ఎంపీటీసీల భేటీ
రామగిరి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన రామగిరి మండల ఎంపీటీసీ సభ్యులు మంగళవారం కలిశారు. రామగిరి ఎంపీపీ స్థానాన్ని అడ్డదారుల్లో దక్కించుకునేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత సాగిస్తున్న కుట్రను భగ్నం చేస్తూ ఎన్నికకు ఎంపీటీసీలందరూ గైర్హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రామగిరి మండలంలో నెలకొన్న పరిస్థితులను వారు వైఎస్ జగన్‌కు వివరించారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో ఎంపీటీసీ సభ్యులు సుజాతమ్మ, భారతి, వెంకటలక్ష్మమ్మ, ఆదిలక్ష్మి, బాలకొండయ్య, సాయిలీల, వైఎస్సార్‌సీపీ నాయకులు జయచంద్రారెడ్డి, వెంకటరెడ్డి, శంకరయ్య, వెంకటేష్ తదితరులు ఉన్నారు.