జిల్లా పరిధిలో శనివారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. వేసవితాపం అధికంగా కొనసాగుతోంది. గంటకు 6 నుంచి 10 కి.మీ వేగంతో నైరుతి దిశగా గాలి వీచింది. | - | Sakshi
Sakshi News home page

జిల్లా పరిధిలో శనివారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. వేసవితాపం అధికంగా కొనసాగుతోంది. గంటకు 6 నుంచి 10 కి.మీ వేగంతో నైరుతి దిశగా గాలి వీచింది.

May 19 2025 2:38 AM | Updated on May 19 2025 2:38 AM

జిల్ల

జిల్లా పరిధిలో శనివారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. వేసవితాపం అ

నమో నారసింహ

పెన్నోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఉత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు.

టన్ను చీనీ రూ.37 వేలు

అనంతపురం మార్కెట్‌యార్డులో

శనివారం టన్ను చీనీకాయలు గరిష్టంగా రూ.37 వేలు, కనిష్టంగా రూ.5 వేల ప్రకారం ధర పలికాయి.

ఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025

సందడిగా జేఎన్‌టీయూ (ఏ) 14వ స్నాతకోత్సవం

చాన్స్‌లర్‌ హోదాలో హాజరైన గవర్నర్‌ జస్టిస్‌ నజీర్‌

డాక్టర్‌ చావా సత్యనారాయణకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం

విద్యార్థులకు బంగారు పతకాల బహూకరణ

అనంతపురం: జేఎన్‌టీయూ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన స్నాతకోత్సవానికి చాన్స్‌లర్‌ హోదాలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ హాజరయ్యారు. గౌరవ డాక్టరేట్‌ గ్రహీత డాక్టర్‌ చావా సత్యనారాయణ, వీసీ ప్రొఫెసర్‌ హెచ్‌. సుదర్శనరావు, ముఖ్య అతిథి, కాన్పూర్‌ ఐఐటీ ఎమిరటర్స్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎం.ఆర్‌. మాధవ్‌, పాలకమండలి సభ్యులు, డీన్లు వేదికపై ఆశీనులయ్యారు. చాన్స్‌లర్‌ హోదాలో ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించారు. గవర్నర్‌ ప్రసంగం ఆద్యంతమూ విద్యార్థులు చప్పట్లతో హోరెత్తించారు. ప్రసంగం ప్రారంభంలో ‘జేఎన్‌టీయూ విద్యార్థులు బంగారు బిడ్డలు’ అంటూ గవర్నర్‌ అనడం ఆకట్టుకుంది. డాక్టర్‌ చావా సత్యనారాయణకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేయడం ద్వారా వర్సిటీ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది.

సందడే.. సందడి

స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని పీజీ, పీహెచ్‌డీ, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. మొత్తం 41 బంగారు పతకాలు ఇవ్వగా, 27 బంగారు పతకాలు అమ్మాయిలే సాధించడం గమనార్హం. ఈ సందర్భంగా విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ‘బంగారు’ క్షణాలను సెల్ఫీలు తీసుకుని పదిలపరచుకున్నారు.విద్యార్థుల తల్లిదండ్రులు, వారి బంధువులతో వర్సిటీలో సందడి వాతావరణం నెలకొంది. పతకాలు పొందిన బిడ్డలను చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు.

దక్షిణాదిలోనే ఘనత..

జేఎన్‌టీయూ (ఏ) వీసీ ప్రొఫెసర్‌ హెచ్‌. సుదర్శనరావు స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. వర్సిటీ సాధించిన ప్రగతిని వివరించారు. ఏకంగా 90 వేల మంది వర్సిటీ విద్యార్థులు నైపుణ్య కోర్సులను పూర్తి చేశారని, దక్షిణ భారతదేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి వర్సిటీగా జేఎన్‌టీయూ ఖ్యాతి దక్కించుకుందన్నారు. ‘ద టైమ్స్‌ ఇండియా వరల్డ్‌ ర్యాంకింగ్‌’లో 801–1,000 ర్యాంకు దక్కించుకుందన్నారు. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ కోర్సులో మైనర్‌ డిగ్రీని ప్రవేశపెట్టామని,అపార్‌ అనుసంధానంతో అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్‌ను ఏర్పాటు చేశామన్నారు. రూ.22 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టామన్నారు. గేట్‌– 2024లో జాతీయ స్థాయిలో 25 ర్యాంకులు వచ్చాయని, జాతీయ స్థాయిలో పి. హేమంత్‌ రెడ్డి ఏడో ర్యాంకు,కే. జ్ఞానేశ్వర రెడ్డి 144వ ర్యాంకు సాధించి వర్సిటీ కీర్తిని ఇనుమడింపజేశారన్నారు. మొత్తం 33 పేటెంట్లు, 354 జర్నల్స్‌, 72 పుస్తకాలు, 1,500 పేపర్లు పబ్లిష్‌ చేసినట్లు పేర్కొన్నారు. ‘రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌’లో వర్సిటీ భాగస్వామి కావడం గర్వకారణమన్నారు.

గవర్నర్‌ ప్రశఽంస..

స్నాతకోత్సవ నిర్వహణపై గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులందరూ మంచి క్రమశిక్షణతో ఉన్నారంటూ ప్రశంసలు గుప్పించారు. ఇంతటి చక్కటి వాతావరణంలో సాగిన కార్యక్రమాన్ని గతంలో ఎన్నడూ చూడలేదంటూ కితాబిచ్చారు.

విజయవంతం..

స్నాతకోత్సవం నిర్దేశించిన సమయానికి ప్రారంభమైంది. ఎలాంటి చిన్న తప్పిదం లేకుండా విజయవంతంగా ముగిసింది. బంగారు పతకాలు దక్కించుకున్న విద్యార్థులతో గవర్నర్‌ సరదాగా ముచ్చటించారు. ఆరు పతకాలు దక్కించుకున్న విద్యార్థి నంద్యాల పూజిత్‌ కుమార్‌ రెడ్డిని ఉద్దే శించి.. బంగారు పతకాలు చాలా బరువుగా ఉన్నాయంటూ సరదాగా వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఎస్‌. కృష్ణయ్య, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

న్యూస్‌రీల్‌

లక్ష్యం వైపు దృష్టి నిలిపారు. ఆత్మవిశ్వాసం, కృషితో ‘బంగారు’ కలను నెరవేర్చుకున్నారు. గవర్నర్‌ చేతుల మీదుగా పతకాలనందుకుని కేరింతలు కొట్టారు. తల్లిదండ్రులకు సంతోషం పంచారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. అతిథుల స్ఫూర్తివంతమైన మాటలను విని ఉప్పొంగారు. రాయలసీమకే తలమానికంగా నిలిచిన అనంతపురం జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ 14వ స్నాతకోత్సవ సంబరం అంబరమంటింది.

‘బంగారు’ కొండలు వీరే..

జిల్లా పరిధిలో శనివారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. వేసవితాపం అ1
1/6

జిల్లా పరిధిలో శనివారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. వేసవితాపం అ

జిల్లా పరిధిలో శనివారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. వేసవితాపం అ2
2/6

జిల్లా పరిధిలో శనివారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. వేసవితాపం అ

జిల్లా పరిధిలో శనివారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. వేసవితాపం అ3
3/6

జిల్లా పరిధిలో శనివారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. వేసవితాపం అ

జిల్లా పరిధిలో శనివారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. వేసవితాపం అ4
4/6

జిల్లా పరిధిలో శనివారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. వేసవితాపం అ

జిల్లా పరిధిలో శనివారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. వేసవితాపం అ5
5/6

జిల్లా పరిధిలో శనివారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. వేసవితాపం అ

జిల్లా పరిధిలో శనివారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. వేసవితాపం అ6
6/6

జిల్లా పరిధిలో శనివారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. వేసవితాపం అ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement