
జిల్లాలో విస్తారంగా వర్షాలు
పుట్టపర్తి అర్బన్: జిల్లా వ్యాప్తంగా గత నాలుగు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం తెల్లవారు జామున 24 మండలాల్లో వర్షాలు కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా కనగానపల్లి మండలంలో 75.2 మి.మీటర్లు, ధర్మవరం 71.6, బుక్కపట్నం 46, తాడిమర్రి 41.2, బత్తలపల్లి 36.2, పుట్టపర్తి 33.2, చిలమత్తూరు 33.2, కొత్తచెరువు 27.6, గాండ్లపెంట 24.4, కదిరి 21.2, అమడగూరు మండలంలో 20.8 మి.మీటర్ల వర్షం కురిసింది. అలాగే ఓడీచెరువు మండలంలో 16.4, సీకేపల్లి 16.2, ముదిగుబ్బ 12.6, రామగిరి 11.8, తలుపుల 9.4, నల్లచెరువు 7.2, గోరంట్ల 5.4, తనకల్లు 4.8, నల్లమాడ 4.2, సోమందేపల్లి 3.8, పెనుకొండ 2.8, ఎన్‌పీ కుంట 2.4, రొద్దం మండలంలో 2 మి.మీటర్ల వర్షం కురిసింది. వర్షం రాకతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముంగారు సేద్యానికి ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

జిల్లాలో విస్తారంగా వర్షాలు

జిల్లాలో విస్తారంగా వర్షాలు