
ప్రాజెక్ట్‌ల స్థాపనకు భూములు సిద్ధం చేయండి
ప్రశాంతి నిలయం: జిల్లాలో ఇంధన ప్రాజెక్ట్ స్థాపనకు అవసరమైన భూసేకరణకు అనువైన భూములు జాబితాలు సిద్ధం చేయాలని కలెక్టర్ చేతన్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఇంధన ప్రాజెక్ట్‌ల భూసేకరణకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. చేతన్ మాట్లాడుతూ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జిల్లాలో 4 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్ స్థాపనకు అవసరమై భూమి సేకరించాల్సి ఉందన్నారు. సంబంధిత ఆర్డీఓలు, తహసీల్దార్లు ఆయా మండలాల్లో ప్రభుత్వ భూమి లభ్యత ఎంత ఉందో వివరాలు సేకరించాలన్నారు. పట్టా ఉన్న రైతులు తమ భూమిని లీజుకు ఇస్తే ఎకరానికి ఏడాదికి రూ.31 వేల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. లీజుకు అంగీకరించే రైతుల భూముల జాబితా సిద్ధం చేయాలన్నారు. ఈ నెల 20లోపు భూముల జాబితాలు సిద్ధం చేసి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో పరిశీలించాలని చెప్పారు. 22న ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముదిగుబ్బ, తలుపుల, రొద్దం, గుడిబండ, కనగానపల్లి, చిలమత్తూరు, హిందూపురం, అగళి, రామగిరి, మండలాల్లో భూసేకరణ కార్యక్రమం చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్, కదిరి, ధర్మవరం, పెనుకొండ ఆర్డీఓలు శర్మ, మహేష్, ఆనంద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్ చేతన్

ప్రాజెక్ట్‌ల స్థాపనకు భూములు సిద్ధం చేయండి