
ప్రజా కోర్టులో శిక్ష తప్పదు
తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేసిన 9 మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు ప్రజా కోర్టులో శిక్ష పడడం ఖాయం. పార్టీ విప్ ధిక్కరించి అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలకడం అన్యాయం. కూటమి నేతలు అంబేడ్కర్ రాజ్యాంగాన్ని గౌరవించాలి. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలో గెలవాలి. అడ్డదారిలో అధికారాన్ని దక్కించుకోవడం చేతగాని తనం. కూటమి నేతలు రెడ్‌బుక్ రాజ్యాంగంతో రెచ్చిపోతున్నారు. వారి అరాచకాలే వారి పతనానికి కారణమవుతాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైంది. ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. కూటమి నాయకులు ఎన్ని కుట్రలు చేసినా అవి తాత్కాలికమే. భవిష్యత్ వైఎస్సార్‌సీపీదే.
– ఈరలక్కప్ప, వైఎస్సార్‌సీపీ
సమన్వయకర్త, మడకశిర