
జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటా
చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టం. నా ఆసక్తిని గమనించి అమ్మ, నాన్న ప్రోత్సహించారు. పీఈటీ సూచనలతో సాధన చేసి ఆటలోని మెలకువలను తెలుసుకున్నా. అండర్ –14 బాలుర విభాగంలో 2024, అక్టోబర్‌లో హిందూపురంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరఫున పాల్గొనే అవకాశం దక్కింది. అలాగే ఈ ఏడాది ఏప్రిల్‌లో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రతిభ చూపాను. జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా సాధన చేస్తున్నా – పి.లోకేష్‌బాబు, ఎంజీఎం పాఠశాల, హిందూపురం