
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
పుట్టపర్తి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా... నేటికీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఘోరంగా విఫలమైందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు శెట్టిపి జయచంద్రారెడ్డి మండిపడ్డారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం కొత్తచెరువులోని డీఈఓ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా జయచంద్రారెడ్డి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న విద్యారంగ వ్యతిరేక విధానాలతో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. పాఠశాలల పునర్వవ్యవస్థీకరణను పారదర్శకంగా చేపట్టాలన్నారు. బదిలీలు, పదోన్నతుల్లో అశాసీ్త్రయ విధానాలు వీడాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రాథమిక పాఠశాలలో 1ః20 నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను నియమించాలని, అన్ని మోడల్ ప్రైమరీ పాఠశాలలో 5 తరగతులను బోధించటానికి ఐదుగురు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. విద్యార్థుల సంఖ్య 75కు మించితే పీఎస్ హెచ్‌ఎం పోస్టు అదనంగా కేటాయించాలన్నారు. అలాగే విద్యార్థుల సంఖ్య 120 దాటితే ఆరుగురు ఉపాధ్యాయులను కేటాయించాలని, ఆపై ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఎస్జీటీని కేటాయించాలని, అన్ని ప్రాథమిక పాఠశాలల్లోనూ స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాలలో సమాంతర మీడియంను కొనసాగించాలన్నారు. బదిలీ జీఓ వెంటనే విడుదల చేసి వేసవిలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అనంతరం శిబిరం వద్దకు వచ్చిన డీఈఓ కృష్ణప్పకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి సుధాకర్, గౌరవాధ్యక్షుడు భూతన్న, బాబు, శ్రీనివాసులు, నారాయణ, శివశంకర్, అనిల్‌కుమార్, మారుతి, తదితరులు పాల్గొన్నారు.
ధర్నాలో యూటీఎఫ్ నేతల డిమాండ్