
ప్రశాంతి నిలయంలో ఘనంగా బుద్ధపౌర్ణమి
ప్రశాంతి నిలయం: ప్రశాంతి నిలయంలో బుద్ధపౌర్ణమి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్‌కు చెందిన జోన్–4 మయన్మార్, నేపాల్, శ్రీలంక, జోన్–5 బ్రూనై, ఇండోనేషియా, జపాన్, లావోస్, మలేషియా, సింగపూర్, తైవాన్ దేశాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్‌రాజు, గ్లోబల్ కౌన్సిల్ చైర్మన్ చక్రవర్తి జ్యోతి ప్రజ్వలతో వేడుకలను ప్రారంభించారు. వేడుకలనుద్దేశించి బౌద్ధ ప్రముఖుడు వాస్‌దేవ్ కిలానీ, బౌద్ధ సన్యాసి కెంపోపెమా వోసెర్ మాట్లాడారు.